
ట్యాగ్ · 1187 కథనాలు · పేజీ 33


సూపర్ స్టార్ ను పరామర్శించిన మెగాస్టార్

దసరా-ధూమ్ ధామ్ దోస్తానా అంటున్న నాని

RAPO 20 మూవీ అప్ డేట్

#NBK107 మూవీ టర్కీ షెడ్యూల్ పూర్తి

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం రిలీజ్ డేట్ ఫిక్స్

గాడ్ ఫాదర్ మూవీ ట్రైలర్ రిలీజ్

ఆది ‘CSI సనాతన్’ గ్లింప్స్ రిలీజ్

సైమా అవార్డ్ తో శ్రీలీల

మహేష్ కుటుంబానికి టాలీవుడ్ సెలబ్రిటీల సంతాపం

డబుల్ ప్రాఫిట్ తో బింబిసార

సెన్సార్ పూర్తి చేసుకున్న నేనే వస్తున్నా

క్రేజీ ఫెలో మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్
కె కె రాధామోహన్ నిర్మాతగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఆది సాయి కుమార్ , దిగాంగన , మిర్న ప్రధాన పాత్రలలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ డ్రామా క్రేజీ ఫెలో మూవీ అక్టోబర్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో శుభశ్రీ రాయగురు , రఘు కుంచె ముఖ్య పాత్రలలో నటించారు. ఆర్ ఆర్ ధృవన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

కృష్ణ వ్రింద విహారి సక్సెస్ ను అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ - నాగశౌర్య
ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై అనీష్ కృష్ణ దర్శకత్వంలో , నాగశౌర్య సెటియా జతగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ కృష్ణ వ్రింద విహారి మూవీ సెప్టెంబర్ 23 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో రాధికా శరత్ కుమార్ , వెన్నెల కిషోర్ , సత్య , రాహుల్ రామకృష్ణ , బ్రహ్మాజీ ముఖ్య పాత్రలలో నటించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.ఒక డిఫరెంట్ రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన నాగశౌర్య తన కామెడీ టైమింగ్ ప్రేక్షకులను అలరించారు. హీరోయిన్ షిర్లే సెటియా కి ఈ సినిమాలో చాలా క్యూట్ గా అందంగా కనిపించడమే కాకుండా నటన పరంగా కూడా తాను బాగా ఇంప్రెస్ చే శారు. నాగశౌర్య , షిర్లే ల స్కరేం కెమిస్ట్రీ ప్రేక్షకులను…

నేనే వస్తున్నా మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఈసినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. విభిన్నమైన కథతో వైవిధ్యంగా తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్ ఒకసారి ఎంజాయ్ చేయొచ్చు.

సూపర్ స్టార్ ను పరామర్శించిన మెగాస్టార్
మహేష్ బాబు ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. కొద్ది నెలల క్రితమే మహేష్ అన్నయ్య రమేష్ బాబు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక ఆ బాధనుండి కోలుకోకముందే అప్పుడే మరో విషాద ఘటన చోటుచేసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరా దేవి గారు ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇక ఆమె మృతిపై స్పందిస్తూ అభిమానులు, సినీ సెలబ్రిటీస్ అందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక అంత్యక్రియలు కూడా నిర్వహించారు. పద్మాలయ స్టూడియో నుంచి మహా ప్రస్థానం వరకు కొనసాగిన అంతిమ యాత్రలో మహేష్ కుటుంబసభ్యులతోపాటు.. పలువురు సినీ…

ది ఘోస్ట్ , స్వాతిముత్యం మూవీస్ కు ఆల్ ది బెస్ట్ - చిరంజీవి
కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సూపర్ హిట్ లూసిఫర్ మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సూపర్ హిట్ PSV గరుడ వేగ మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ది ఘోస్ట్, పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వంలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సోదరుడు బెల్లంకొండ గణేష్ , వర్ష బొల్లమ్మ జంటగాతెరకెక్కిన…

దసరా-ధూమ్ ధామ్ దోస్తానా అంటున్న నాని
రీసెంట్ గానే అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ప్రస్తుతం మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. దసరా అనే డిఫరెంట్ కథతో ఈసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇంతకుముందు ఎప్పుడు చేయని డీ గ్లామర్ పాత్రలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నాని. సింగరేణి బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీకి డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్, గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి.

పుష్ప :ది రైజ్ మూవీ తో మంచి గుర్తింపు వచ్చింది - అల్లు అర్జున్
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పు ష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి…

RAPO 20 మూవీ అప్ డేట్
పలు యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీస్ తో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హీరో రామ్ మరో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ #RAPO20 మూవీ పూజ కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే.దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానున్న #RAPO 20 మూవీలో ఏజెంట్ మూవీ బ్యూటీ సాక్షి వైద్య కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

#NBK107 మూవీ టర్కీ షెడ్యూల్ పూర్తి
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ #NBK 107 మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. బాలకృష్ణ బర్త్ డే (జూన్ 10)సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ హంట్ 10 మిలియన్ వ్యూస్ కు పైగా సాధించి దూసుకుపోతోంది.

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రస్తుతం అల్లరి నరేష్ కూడా చాలా జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రేక్షకుల ఆలోచన తీరుకు తగ్గట్టుగా విభిన్నమైన సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నాడు. అలా నాంది సినిమా చేసే మంచి ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఇట్లు మారేడుమిల్లి సినిమా ఒకటి.. ఇంకా నాంది డైరెక్టర్ తోనే ఉగ్రం అనే మరో సినిమా. వీటిలో ఇట్లు మారేడుమిల్లి సినిమానే రిలీజ్ కు సిద్దమవుతుంది. రాజ్‌మోహన్ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం.

గాడ్ ఫాదర్ మూవీ ట్రైలర్ రిలీజ్
కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సూపర్ హిట్ లూసిఫర్ మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ దసరా పండగ కానుకగా అక్టోబర్ 5వ తేదీ రిలీజ్ కానుంది.ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్, అనసూయ, దర్శకుడు పూరి జగన్నాథ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన గాడ్ ఫాదర్ మూవీ పోస్టర్స్, ఫస్ట్ సింగిల్, టీజర్ ప్రేక్షక…

జిన్నా టైటిల్ సాంగ్ రిలీజ్
ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. చాలా గ్యాప్ తరువాత మంచు విష్ణు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాపై మంచి నమ్మకంతోనే ఉన్నాడు విష్ణు. ఈసినిమా రిలీజ్ డేట్ ను ముందు అక్టోబర్ 5న రిలీజ్ చేద్దామని ముందు ఫిక్స్ అయ్యారు. అయితే ఆరోజు చాలా సినిమాలు రిలీజ్ కు పోటీ పడుతుండటంతో ఆపోటీ నుండి తప్పుకున్నాడు మంచు విష్ణు. ఈసినిమాను అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది.

ఆది ‘CSI సనాతన్’ గ్లింప్స్ రిలీజ్
సాయికుమార్ తనయుడిగా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆది సాయికుమార్.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోని వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక జయాపజయాలతో పనిలేకుండా ప్రస్తుతం చాాలా సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఆయన లిస్ట్ లో దాదాపు అరడజను సినిమాలు పైగా ఉన్నాయి. అందులో ‘CSI సనాతన్’ ఒకటి. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాకు శివశంకర్ దేవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరపుకుంటుంది.

చరణ్ 15 ఏళ్ల సినీ జర్నీ-నిన్ను చూసి గర్వపడుతున్నా
మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామ్ చరణ్. చిరుత సినిమాతో అరంగేట్రం చేసిన చిరు ఆ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపునే పొందాడు. ఆ తరువాత పలు సినిమాలు చేస్తూ మెగాపవర్ స్టార్ గా స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. మెగాస్టార్ కొడుకు అన్న భావనను పక్కన పెట్టేసి ప్రతి సినిమాకు విభిన్నత చూపించుకుంటూ ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. తన కెరీర్ లో ఒక మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ ఇలా ఎన్నో క్లాసిక్ హిట్లను అందుకున్నాడు.

పొన్నియిన్ సెల్వన్1 మూవీ కి ప్రత్యేక ఆకర్షణగా మెగా స్టార్ చిరంజీవి వాయిస్
మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్‌కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్, భారీ తారాగణంతో దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న పొన్నియిన్…

సైమా అవార్డ్ తో శ్రీలీల
కమర్షియల్ హిట్ పెళ్ళి సందD మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన శ్రీలీల , ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం శ్రీలీల టాలీవుడ్ లో బిజీ హీరోయిన్స్ లో ఒకరిగా మారిపోయారు. రవితేజ ధమాకా !, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు, వైష్ణవ్‌తేజ్ సినిమాతో పాటుగా గాలి జనార్ధన్‌రెడ్డి తనయుడు హీరోగా పరిచయమవుతున్న మూవీ లో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు.శ్రీ లీల కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

మహేష్ కుటుంబానికి టాలీవుడ్ సెలబ్రిటీల సంతాపం
టాలీవుడ్ లో ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలను కోల్పోయింది. రీసెంట్ గానే సీనియర్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి చెందారు. ఇంకా ఆ సంఘటన నుండి టాలీవుడ్ కోలుకోక ముందే అప్పుడే మరో విషాద సంఘటన చోటుచేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి నేడు తుది శ్వాస విడిచారు. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లో ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇక నేడు పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందారు. దీంతో మహేష్ కుటుంబంలో విషాదం అలుముకుంది. రీసెంట్‌గా ఘట్టమనేని కుటుంబంలో రమేష్ బాబు చనిపోయారు. ఇప్పుడు ఇందిరా దేవి కూడా చనిపోవటం ఎంతో బాధాకరం. ఇక ఇందిరా దేవి మరణంతో…

15 ఇయర్స్ సినీ జర్నీ కంప్లీట్ చేసుకున్న రామ్ చరణ్
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్ , నేహశర్మ జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ చిరుత మూవీ 2007 సెప్టెంబర్ 28 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 40 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకుంది. మొదటి చిత్రమైనా హీరో రామ్ చరణ్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని తండ్రి (మెగా స్టార్ చిరంజీవి ) కి తగ్గ తనయుడిగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ 2 వ మూవీ గా తెరకెక్కిన ఫాంటసీ , యాక్షన్ మూవీ మగధీర ఘనవిజయం సాధించి 150 కోట్ల క్లబ్ లో చేరింది. 1000 రోజుల థియేట్రికల్ రన్ తో మగధీర మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ రామ్ చరణ్ లో…

డబుల్ ప్రాఫిట్ తో బింబిసార
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన బింబిసార మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది.బింబిసార మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందించారు. ఈ మూవీ లో త్రిగర్తల రాజ్యాధినేత బింబిసార గా తన డైలాగ్ డెలివరీ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు..భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న బింబిసార మూవీ మూడు రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.మొదటి వారం లో బింబిసార మూవీ 50 కోట్ల క్లబ్ లో…

సెన్సార్ పూర్తి చేసుకున్న నేనే వస్తున్నా
ధనుష్ కు తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే తన సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు ఏకంగా తెలుగులో డైరెక్ట్ గా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం డైరెక్ట్ గా తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు. ఇక తమిళ్ లో కూడా ధనుష్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం తను చేస్తున్న సినిమాల్లో నానే వరువెన్ సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈసినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేశాయి.