
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ #NBK 107 మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. బాలకృష్ణ బర్త్ డే (జూన్ 10)సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ హంట్ 10 మిలియన్ వ్యూస్ కు పైగా సాధించి దూసుకుపోతోంది.
#NBK107 మూవీ తాజా షెడ్యూల్ టర్కీ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్ లో కొన్ని సాంగ్స్ తోపాటు పలు కీలక సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. తాజాగా టర్కీ లో జరిగిన కీలక షెడ్యూల్ కంప్లీట్ అయిందనీ , చిత్ర యూనిట్ తిరిగి హైదరాబాద్ కు చేరుకోనున్నారనీ సమాచారం. హీరో బాలకృష్ణ , దర్శకుడు గోపీచంద్ మలినేని ఫ్యామిలీ ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న #NBK107 మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.








