ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. చాలా గ్యాప్ తరువాత మంచు విష్ణు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాపై మంచి నమ్మకంతోనే ఉన్నాడు విష్ణు. ఈసినిమా రిలీజ్ డేట్ ను ముందు అక్టోబర్ 5న రిలీజ్ చేద్దామని ముందు ఫిక్స్ అయ్యారు. అయితే ఆరోజు చాలా సినిమాలు రిలీజ్ కు పోటీ పడుతుండటంతో ఆపోటీ నుండి తప్పుకున్నాడు మంచు విష్ణు. ఈసినిమాను అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి వరుసగా పాటలు రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. కొద్దిరోజుల క్రితం ఫ్రెండ్ షిప్ పాటను రిలీజ్ చేశారు. రీసెంట్ గానే గోలీసోడా అంటూ సాగే మాస్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు. జిన్నా టైటిల్ సాంగ్ ను నేడు రిలీజ్ చేశారు చిత్రబృందం. నా పేరు జిన్నారా .. అందరికీ అన్నరా .. నకరల్ జేస్తే కిస్సా ఖల్లాసు రా అంటూ ఈ పాట సాగుతోంది. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి ప్రేమ్ సాహిత్యాన్ని అందించగా పృథ్వీ చంద్ర ఆలపించాడు.
Get ready to Vibe in #𝔾𝕀ℕℕ𝔸🔥 Style!#GinnaBhai🔥▶️ https://t.co/ZXQbPkQYLV #𝐆𝐢𝐧𝐧𝐚𝐓𝐢𝐭𝐥𝐞𝐒𝐨𝐧𝐠💥out now on @saregamasouth.@starlingpayal @SunnyLeone pic.twitter.com/ONjw2Vnvfx
— Vishnu Manchu (@iVishnuManchu) September 28, 2022
కాగా ఈసినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటి సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. కథ, స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు.. భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: