
ట్యాగ్ · 1187 కథనాలు · పేజీ 32


స్టార్ హీరో యష్ గన్ షూటింగ్ ప్రాక్టీస్ వీడియో

రిలీజ్ అయిన కార్తి సర్దార్ మూవీ టీజర్

జనసేన ఆఫీస్ నవరాత్రి పూజ లో పవన్ కళ్యాణ్

స్వాతిముత్యం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ &టైమ్

హరిహర వీరమల్లు కీరవాణి సర్ ప్రైజింగ్ అప్ డేట్

జవాన్లతో సరదాగా గడిపిన అల్లు అర్జున్

శాకుంతలం రిలీజ్ డేట్ వాయిదా

బ్రహ్మాస్త్ర 2 అండ్ 3 రిలీజ్ డేట్లు ముందే ఫిక్స్

3D ఫార్మాట్ లో శాకుంతలం

పొన్నియిన్ సెల్వన్ 1 USA ప్రీమియర్ షో రిపోర్ట్

ఆదిపురుష్ టీజర్ రిలీజ్ డేట్ &టైమ్ అనౌన్స్ మెంట్

ఆది పురుష్ టీజర్ పోస్టర్ అప్ డేట్

అల్లు స్టూడియోస్‌ని ప్రారంభించనున్న మెగాస్టార్

విశాఖ లో #MEGA 154 తాజా షెడ్యూల్

ఊర్వశివో రాక్షసివో టీజర్ రిలీజ్

సత్యదేవ్ 26 షూటింగ్ ప్రారంభం
ఈ తరం హీరోల్లో విభిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో సత్యదేవ్ కూడా ముందుంటాడు. అందుకే ప్రేక్షకులు కూడా సత్యదేవ్ సినిమా అంటే మినిమం గ్యారెంటీగా ఎక్స్పెక్ట్ చేస్తారు. తను కీలకపాత్రలో నటించిన గాడ్ ఫాదర్ సినిమా కూడా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5వ తేదీన రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం అయితే తను పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

USA లో 2 మిలియన్ డాలర్స్ దిశగా పొన్నియిన్ సెల్వన్1
మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్‌కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటించారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయిన పొన్నియిన్ సెల్వన్1 మూవీ కి ఆయా భాషల స్టార్ హీరోస్ వాయిస్ ఓవర్ ఇవ్వటం విశేషం.

స్టార్ హీరో యష్ గన్ షూటింగ్ ప్రాక్టీస్ వీడియో
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ కెజిఎఫ్ చాప్టర్ 1 మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి , కన్నడ చిత్ర పరిశ్రమ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ మూవీ తో హీరో యష్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది స్టార్ డమ్ అందుకున్నారు. సేమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1 మూవీ సీక్వెల్ కె జి ఎఫ్ చాప్టర్ 2 కన్నడ మూవీ ఏప్రిల్ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి 1240 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. హీరో యష్ నటించే తదుపరి చిత్రానికై…

రిలీజ్ అయిన కార్తి సర్దార్ మూవీ టీజర్
ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై పీ.ఎస్. మిత్రన్ దర్శకత్వం లో కార్తీ హీరోగా తెరకెక్కిన స్ప్రై యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ సర్దార్ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 24 వ తేదీ రిలీజ్ కానుంది . ఈ మూవీ తెలుగు వెర్షన్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కింగ్ నాగార్జున రిలీజ్ చేస్తున్నారు. హీరో కార్తి ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో రాశీఖన్నా , రజిష విజయన్ కథానాయికలు.చుంకీ పాండే విలన్ గా నటిస్తున్న ఈ మూవీలోని ఇతర పాత్రల్లో లైలా, మురళీ శర్మ, మునిష్ కాంత్ తదితరులు నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

పొన్నియన్ సెల్వన్ పార్ట్1 రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఇలాంటి కథలు రావడం చాలా అరుదుగా జరుగుతుంది. చరిత్రలో మనకు తెలియని ఎన్నో విషయాలను డైరెక్టర్లు ముందుకు వచ్చి తెలియచేసే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఇలాంటి సినిమాలను ఆవర్గం, ఈ వర్గం అని కాకుండా అందరూ ఖచ్చితంగా చూడాలి అని చెప్పొచ్చు.

జనసేన ఆఫీస్ నవరాత్రి పూజ లో పవన్ కళ్యాణ్
బ్లాక్ బస్టర్ భీమ్లా నాయక్ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో అలరించనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరి హర వీరమల్లు పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్ , నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను…

స్వాతిముత్యం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ &టైమ్
పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వంలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సోదరుడు బెల్లంకొండ గణేష్ , వర్ష బొల్లమ్మ జంటగా తెరకెక్కిన స్వాతిముత్యం మూవీ అక్టోబర్ 5 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద ముఖ్య పాత్రలలో నటించారు. సాగర్ మహతి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

హరిహర వీరమల్లు కీరవాణి సర్ ప్రైజింగ్ అప్ డేట్
హరిహర వీరమల్లు.. ఈసినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎప్పటినుండి ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమా ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా కనిపించట్లేదు. ఎప్పటినుండో పెండింగ్ లో ఉంటూనే వస్తుంది. అయితే ఈసినిమా షూటింగ్ అప్పుడు మొదలవుతుంది.. ఇప్పుడు మొదలవుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇంకా షూటింగ్ మొదలుకాలేదు. ఇక మరోవైపు పవన్ కూడా రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల ఈసినిమా షూటింగ్ కు లేట్ అవుతూ వస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 17 వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది.

జవాన్లతో సరదాగా గడిపిన అల్లు అర్జున్
టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో అల్లు అర్జున్-స్నేహారెడ్డి జంట కూడా ఒకటి. ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా అల్లు అర్జున్ కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో తెలిసిందే కదా. ఇక ప్రస్తుతం అయితే తన ఖాళీ సమయాన్ని ఫ్యామిలీతో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా ఆ హ్యాపీనెస్ ను పంచుకుంటూనే ఉంటాడు. ఇక తన భార్య స్నేహారెడ్డి బర్త్ డేను ఘనంగా సెలెబ్రేట్ చేశాడు బన్నీ. దీనిలో భాగంగానే ఆమె బర్త్ డే సందర్భంగా కూతురు అర్హ, కుమారుడు అయాన్ తో కలిసి ప్రత్యేకంగా అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్ ని దర్శించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ కూడా వైరల్ అయ్యాయి. ఆ తరువాత అమృత్ సర్ లోని బిఎస్ఎఫ్…

శాకుంతలం రిలీజ్ డేట్ వాయిదా
సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది.మహాభారతంలోని ఆదిపర్వంలో దుష్యంతుడి ప్రేమకథ ఆధారంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు గుణశేఖర్. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాకు విజువల్స్ ఎంత ముఖ్యమో తెలిసిందే కదా. ప్రస్తుతం చిత్రయూనిట్ అదే పనిలో ఉంది. ప్రేక్షకులకు విజులవల్ ట్రీట్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇక ఈసినిమాను నవంబర్ 4వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈసినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది. ఈవిషయాన్ని తెలియచేస్తూ చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేశారు.

టైగర్ నాగేశ్వర రావు మూవీ లో రేణు దేశాయ్ లుక్ , వీడియో క్లిప్ రిలీజ్
తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై వంశీ దర్శకత్వం లో మాస్ మహారాజా రవితేజ హీరోగా స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో నుపుర్ సనన్ కథానాయిక కాగా గాయత్రి భరద్వాజ్ , రేణు దేశాయ్ , అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుండి ఫస్ట్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

బ్రహ్మాస్త్ర 2 అండ్ 3 రిలీజ్ డేట్లు ముందే ఫిక్స్
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ అలియా భట్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా బ్రహ్మాస్త్ర. భారీ బడ్జెట్ తో విభిన్నమైన కథతో విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈసినిమా సెప్టెంబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రం కాస్త ఊరటనిచ్చింది అని చెప్పొచ్చు. ఈసినిమా బాయ్ కట్ సెగను కూడా తట్టుకొని మంచి విజయాన్ని దక్కించుకుంది. నార్త్ తో పాటు సౌత్ లో కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఎక్కడా ఈసినిమా వెనుకాడలేదు.. ప్రపంచవ్యాప్తంగా ఈసినిమా ఇప్పటికే 400 కోట్లకు పైగా సొంతం చేసుకుంది.

3D ఫార్మాట్ లో శాకుంతలం
దిల్ రాజు ప్రొడక్షన్స్ , గుణ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత , దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో శాకుంతలం మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీ లో అదితి బాలన్ , మోహన్ బాబు , ప్రకాష్ రాజ్ , కబీర్ దుహన్ సింగ్ , అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఓటీటీ లోకి వచ్చేసిన శాకిని డాకిని
టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా, నివేద థామస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా "శాకిని డాకిని". ఈసినిమా సౌత్ కొరియా యాక్షన్-కామెడీ చిత్రం 'మిడ్‌నైట్ రన్నర్స్' కు రీమేక్ గా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా సెప్టెంబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్న షాలిని, దామిని అనే ఇద్దరమ్మాయిలు ప్రమాదకరమైన హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాను ఎలా ఎదుర్కొన్నారనే కథాంశంతో కామెడీ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది. కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

పొన్నియిన్ సెల్వన్ 1 USA ప్రీమియర్ షో రిపోర్ట్
మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్‌కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్, భారీ తారాగణంతో దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న పొన్నియిన్…

ఆదిపురుష్ టీజర్ రిలీజ్ డేట్ &టైమ్ అనౌన్స్ మెంట్
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న ఆదిపురుష్ మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు. హీరో ప్రభాస్ నటించిన ఫస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్…

ఆది పురుష్ టీజర్ పోస్టర్ అప్ డేట్
ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా సినిమా ఆది పురుష్. హిందూ మైథలాజికల్ ఫిల్మ్ గా భారీ బడ్జెట్ తో ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అయితే ఈసినిమాకు గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ మెయిన్ కాబట్టి ఈసినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ పనులకే ఎక్కువ టైమ్ పడుతుంది. అందుకే షూటింగ్ చాలా త్వరగా పూర్తయింది కానీ ఎప్పటి నుండో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోనే ఉంది ఈసినిమా.

అల్లు స్టూడియోస్‌ని ప్రారంభించనున్న మెగాస్టార్
అక్టోబర్ 1న, దివంగత తెలుగు నటుడు శ్రీ అల్లు రామలింగయ్య గారి 99వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో కొత్త ఫిలిం స్టూడియో అల్లు స్టూడియోస్‌ను ప్రారంభించనున్నారు. ఈ స్టూడియోను ప్రకటింటిన రోజునే అల్లు అరవింద్, మనవళ్లు అల్లు అర్జున్, బాబీ అల్లు, అల్లు శిరీష్ హైదరాబాద్‌లో ఫిల్మ్ స్టూడియో నిర్మాణ పనులను ప్రారంభించారు. గండిపేట్‌లో 10 ఎకరాల్లో అల్లు స్టూడియోస్ నిర్మాణ పనులు అదే రోజున ప్రారంభం అయ్యాయి. ఇక ఇప్పుడు స్డూడియో నిర్మాణం పూర్తయింది. అందులో చిత్రీకరణ పనులకు సంబంధించి బిల్డింగ్స్ కూాడా అందుబాటులో ఉన్నాయి.

విశాఖ లో #MEGA 154 తాజా షెడ్యూల్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య (వర్కింగ్ టైటిల్ )మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక . బిజూ మీనన్ , మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.వాల్తేరు వీరయ్య (వర్కింగ్ టైటిల్ ) మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. మెగా స్టార్ చిరంజీవి , శృతి హాసన్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో మెగా స్టార్ చిరంజీవి ఒక పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.# MEGA 154 మూవీ తాజా…

ఊర్వశివో రాక్షసివో టీజర్ రిలీజ్
మెగా బ్యాక్ గ్రౌండ్ తో, మరోవైపు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అల్లు శిరీష్. ఇక కెరీర్ మొదట్లో వరుస సినిమాలతో అలరించిన అల్లు శిరీష్ నుండి సినిమా వచ్చి చాలా కాలమే అయింది. కరోనా కారణంగా కాస్త లేట్ అయినా.. కరోనా ప్రభావం లేకపోయినా కూడా తన కొత్త సినిమా రిలీజ్ కు నోచుకోలేకపోయింది. అయితే ఫైనల్ గా ఎన్నో రోజుల నుండి పెండింగ్ లో ఉన్న సినిమా రిలీజ్ కు సిద్దమైంది. రాకేశ్ శశి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా వస్తున్న సినిమా ఊర్వశివో రాక్షసివో. ఎందుకంటే ప్రేమంట సినిమా టైటిల్ ను మార్చారు. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం అయితే అన్ని కార్యక్రమాలు…