సూపర్ స్టార్ ను పరామర్శించిన మెగాస్టార్

megastar chiranjeevi met mahesh babu family personally, chiranjeevi met mahesh babu family personally, mahesh babu family, megastar chiranjeevi, Superstar Mahesh Babu's mother passed away, Ghattamaneni Family, Indira Devi Sudden Demise, Ghattamaneni Indira Devi, Indira Devi, Indira Devi Health Issues, Indira Devi Last Rites at Mahaprasthanam Jubileehills, Indira Devi Latest News, Indira Devi Passes Away, Tollywood superstar Mahesh Babu, mahesh babu, Mahesh Babu Mother, Mahesh Babu Mother Indira Devi, Mahesh Babu Mother Indira Devi Passes Away, Mahesh Babu Mother Latest Updates, Mahesh Babu Mother Latest News, Mahesh Babu’s Mother, Passes Away, Super Star Mahesh Babu, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

మహేష్‌ బాబు ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. కొద్ది నెలల క్రితమే మహేష్ అన్నయ్య రమేష్ బాబు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక ఆ బాధనుండి కోలుకోకముందే అప్పుడే మరో విషాద ఘటన చోటుచేసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరా దేవి గారు ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇక ఆమె మృతిపై స్పందిస్తూ అభిమానులు, సినీ సెలబ్రిటీస్ అందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక అంత్యక్రియలు కూడా నిర్వహించారు. పద్మాలయ స్టూడియో నుంచి మహా ప్రస్థానం వరకు కొనసాగిన అంతిమ యాత్రలో మహేష్ కుటుంబసభ్యులతోపాటు.. పలువురు సినీ ప్రముఖులు ఇంకా ఎంతో మంది అభిమానులు కూడా పాల్గొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి మహేష్ కుటుంబాన్ని స్వయంగా పరామర్శించారు. నిన్న తన ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపిన చిరు నేడు స్వయంగా మహేష్ కుటుంబాన్ని పర్సనల్ గా కలిసి పరామర్శించారు. ఇందిరా దేవి గారికి నివాళులు అర్పించి కాసేపు అక్కడే ఉండి కృష్ణ మరియు మహేష్ బాబు లతో మాట్లాడారు.

కాగా సూపర్ స్టార్ కృష్ణ మొద‌టి భార్య ఇందిరా దేవి. వీరికి ఐదుగురు సంతానం ఉన్నారు. రమేష్ బాబు, మహేష్ బాబు, మంజుల, ప్రియదర్శిని, పద్మావతి వీరిలో రమేష్ బాబు సినీ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. పలు సినిమాల్లో నటించారు, పలు సినిమాలు నిర్మించారు కూడా. ఇక మహేష్ బాబు సూపర్ స్టార్ గా ఎలాంటి క్రేజ్ అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ముగ్గురు కుమార్తెలలో పద్మావతి గల్లా జయదేవ్ ని వివాహం చేసుకోగా మంజుల సంజయ్ స్వరూప్ అనే నటుడిని వివాహ మాడారు. ప్రియదర్శిని నటుడు సుధీర్ బాబును వివాహమాడారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =