దసరా-ధూమ్ ధామ్ దోస్తానా అంటున్న నాని

Dasara Movie First Single Update, Nani, Keerthy Suresh, Srikanth Odela, Dasara First Single, Nani And Keerthy Suresh's Dasara Movie, Nani's Latest Movie, Nani's Upcoming Movie, Dasara Movie First Single, Dasara First Single Update, Dasara, Dasara Telugu movie, Dasara New Update, Dasara Telugu Movie New Update, Dasara Movie, Dasara Latest Update, Dasara Movie Updates, Dasara Telugu Movie Live Updates, Dasara Telugu Movie Latest News, Dasara Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

రీసెంట్ గానే అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ప్రస్తుతం మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. దసరా అనే డిఫరెంట్ కథతో ఈసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇంతకుముందు ఎప్పుడు చేయని డీ గ్లామర్ పాత్రలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ‌స్తున్నాడు నాని. సింగ‌రేణి బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న ఈ మూవీకి డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్‌, గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ తో వచ్చేశాడు నాని. నిజానికి దసరా పండుగ సందర్భంగా ఈసినిమా నుండి ఖచ్చితంగా అప్ డేట్ ఉంటుందని ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అదే నిజం చేస్తూ చిత్రయూనిట్ కూడా అప్ డేట్ ఇచ్చింది. ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ అప్ డేట్ ఇచ్చారు. ఈ అప్ డేట్ ను నాని చిన్న వీడియో రిలీజ్ చేస్తూ తెలిపారు. ధూమ్ ధామ్ దోస్తానా అనే సాంగ్ ను రిలీజ్ చేస్తున్నామని.. ఈ పాట ఇంతకు ముందు ఎప్పుడు చూడని విధంగా మాసియస్ట్ లోకల్ స్ట్రీట్ సాంగ్ గా ఉంటుందని తెలిపాడు. మరి సంతోష్ నారాయణన్ అందించిన ఈ క్రేజీ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.

కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా.. ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =