చరణ్ 15 ఏళ్ల సినీ జర్నీ-నిన్ను చూసి గర్వపడుతున్నా

Chiranjeevi is all praises for Ram Charan as he completes 15 years in TFI, Chiranjeevi About Ram Charan’s 15-Year Acting Career In Tollywood, Ram Charan’s 15-Year Acting Career In Tollywood, Chiranjeevi About Ram Charan’s 15-Year Acting Career, Ram Charan’s 15-Year Acting Career, Chiranjeevi is all praises for Ram Charan, 15-Year Acting Career, Tollywood Acting Career, Chiranjeevi's son Ram Charan Konidela, mega powerstar of Tollywood, Ram Charan Konidela, Chirutha, Magadheera, Rangasthalam, RRR, RC15, Mega Star Chiranjeevi, Ram Charan's Latest Movies, Ram Charan Upcoming Movies, Actor Ram Charan, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామ్ చరణ్. చిరుత సినిమాతో అరంగేట్రం చేసిన చిరు ఆ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపునే పొందాడు. ఆ తరువాత పలు సినిమాలు చేస్తూ మెగాపవర్ స్టార్ గా స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. మెగాస్టార్ కొడుకు అన్న భావనను పక్కన పెట్టేసి ప్రతి సినిమాకు విభిన్నత చూపించుకుంటూ ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. తన కెరీర్ లో ఒక మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ ఇలా ఎన్నో క్లాసిక్ హిట్లను అందుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక చరణ్ 15 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో చిరు తన సోషల్ మీడియా వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన ట్విట్టర్ ద్వారా చిరు..తన సినీ ప్రయాణంలో రామ్ చరణ్ పదిహేను ఏళ్ళ మైల్ స్టోన్ ను చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. ‘చిరుత’ నుంచి ‘మగధీర’కు.. అక్కడి నుంచి ‘రంగస్థలం’ వరకు… అక్కడ నుంచి ‘ఆర్ఆర్ఆర్’, ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న RC15 వరకు నటుడిగా చరణ్ ఎదిగిన తీరు ఎంతో ఆనందాన్ని కలిగించింది అంటూ ట్వీట్ లో తెలిపారు. ఇక మరో ట్వీట్ లో తన వర్క్, డెడికేషన్ అన్నీ చూస్తుంటే సంతోషంగా ఉంది. చరణ్ మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవాలి. నిన్ను చూస్తే చాలా గర్విస్తున్నాను. నీ కోసం ఎన్నో ఉన్నత స్థాయిలు, ఎన్నో గొప్ప ఘనతలు ఉన్నాయి. వాటి వైపు వెళ్ళు. రామ్ చరణ్‌తో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేశారు.

ప్రస్తుతం రామ్ చరణ్ RC 15 మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో భారీస్థాయిలో తెరకెక్కిస్తున్నారు. కాగా కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − 1 =