మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య (వర్కింగ్ టైటిల్ )మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక . బిజూ మీనన్ , మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.వాల్తేరు వీరయ్య (వర్కింగ్ టైటిల్ ) మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. మెగా స్టార్ చిరంజీవి , శృతి హాసన్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో మెగా స్టార్ చిరంజీవి ఒక పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.# MEGA 154 మూవీ తాజా షెడ్యూల్ విశాఖపట్నం లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో చిరంజీవి , రవితేజ లపై సీన్స్ దర్శకుడు తెరకెక్కిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ షెడ్యూల్‌లో రవితేజకు సంబంధించిన మొత్తం షూట్ పూర్తి కానుందనీ , దసరా సందర్భంగా కొంత గ్యాప్ తీసుకుని తరువాత యూరప్‌లోని మాల్టా దేశంలో 20 రోజుల పాటు జరిగే షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి మేకర్స్ ప్లాన్ చేశారనీ సమాచారం. MEGA 154 మూవీ 2023 సంక్రాంతి కానుంకగా రిలీజ్ కానుందని సమాచారం. మెగా స్టార్ చిరంజీవి , స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఫస్ట్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న#MEGA 154 మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: