హరిహర వీరమల్లు.. ఈసినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎప్పటినుండి ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమా ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా కనిపించట్లేదు. ఎప్పటినుండో పెండింగ్ లో ఉంటూనే వస్తుంది. అయితే ఈసినిమా షూటింగ్ అప్పుడు మొదలవుతుంది.. ఇప్పుడు మొదలవుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇంకా షూటింగ్ మొదలుకాలేదు. ఇక మరోవైపు పవన్ కూడా రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల ఈసినిమా షూటింగ్ కు లేట్ అవుతూ వస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 17 వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా నుండి సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు. హరిహర వీరమల్లు చిత్రం వర్క్ షాప్స్ ఇప్పుడు స్టార్ట్ చేశామని నవ రాత్రుల్లో నవ ఉత్తేజం అంటూ స్టైలిష్ లుక్ లో పవన్ ఫోటో షేర్ చేసి తెలియజేసారు. కీరవాణి పెట్టిన లేటెస్ట్ పోస్ట్ ఇప్పుడు మంచి వైరల్ గా మారిపోయింది.
With HHVM himself 😊 నవరాత్రులలో నవ- ఉత్తేజం ! pic.twitter.com/4VNoPdpJ2G
— mmkeeravaani (@mmkeeravaani) September 30, 2022
కాగా ఈసినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ నుండి అర్జున్ రాంపాల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: