సత్యదేవ్ 26 షూటింగ్ ప్రారంభం

Satya Devs new film shoot begins, Satya Dev 26th film, Satya Dev's new film, Satyadev 26, Satya Dev's Latest Movie, Satya Dev Upcoming Movie, Actor Satya Dev, Satyadev Kancharana, Godfather, Satyadev 26 Telugu movie, Satyadev 26 New Update, Satyadev 26 Telugu Movie New Update, Satyadev 26 Movie, Satyadev 26 Latest Update, Satyadev 26 Movie Updates, Satyadev 26 Telugu Movie Live Updates, Satyadev 26 Telugu Movie Latest News, Satyadev 26 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies,

ఈ తరం హీరోల్లో విభిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో సత్యదేవ్ కూడా ముందుంటాడు. అందుకే ప్రేక్షకులు కూడా సత్యదేవ్ సినిమా అంటే మినిమం గ్యారెంటీగా ఎక్స్పెక్ట్ చేస్తారు. తను కీలకపాత్రలో నటించిన గాడ్ ఫాదర్ సినిమా కూడా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5వ తేదీన రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం అయితే తను పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో యూనిక్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా ఈసినిమా తెరకెక్కుతుంది. మల్టీ స్టారర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ డాలీ ధనంజయ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ చిత్రం ధనంజయ కూడా 26వ చిత్రమే. గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం షూటింగ్ ఈరోజు ప్రారంభమైయింది.

కాాగా ఓల్డ్ టౌన్ పిక్చర్స్ ప్రొడక్షన్ నంబర్ 1 గా నిర్మాతలు బాల సుందరం, దినేష్ సుందరం క్రైమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మణికంఠన్ కృష్ణమాచారి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చరణ్ రాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. మీరాఖ్ డైలాగ్స్ అందిస్తున్న ఈ చిత్రానికి అనిల్ క్రిష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 8 =