అల్లు స్టూడియోస్‌ని ప్రారంభించనున్న మెగాస్టార్

Megastar Chiranjeevi to inaugurate Allu Studios, Chiranjeevi to inaugurate Allu Studios, Allu Studios, Megastar Chiranjeevi, Chiranjeevi, Producer Allu Aravind, Icon Star Allu Arjun, Allu Sirish, Allu Venkatesh, Allu Studios Inauguration, Allu Studios Opening, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

అక్టోబర్ 1న, దివంగత తెలుగు నటుడు శ్రీ అల్లు రామలింగయ్య గారి 99వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో కొత్త ఫిలిం స్టూడియో అల్లు స్టూడియోస్‌ను ప్రారంభించనున్నారు. ఈ స్టూడియోను ప్రకటింటిన రోజునే అల్లు అరవింద్, మనవళ్లు అల్లు అర్జున్, బాబీ అల్లు, అల్లు శిరీష్ హైదరాబాద్‌లో ఫిల్మ్ స్టూడియో నిర్మాణ పనులను ప్రారంభించారు. గండిపేట్‌లో 10 ఎకరాల్లో అల్లు స్టూడియోస్ నిర్మాణ పనులు అదే రోజున ప్రారంభం అయ్యాయి. ఇక ఇప్పుడు స్డూడియో నిర్మాణం పూర్తయింది. అందులో చిత్రీకరణ పనులకు సంబంధించి బిల్డింగ్స్ కూాడా అందుబాటులో ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక అల్లు స్టూడియోస్‌ను ప్రారంభించే గ్రాండ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు వెంకటేష్ మరియు అల్లు కుటుంబం మొత్తంతో కలిసి ఈ స్టూడియోలను మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించనున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లోని సినిమా షూటింగులకి అల్లు స్టూడియో కేరాఫ్ అడ్రెస్ గా మారనుంది.

ఇదిలా ఉండగా అదే రోజున అల్లు రామ‌లింగ‌య్య‌ని స్మ‌రించుకొంటూ ఓ కార్య‌క్ర‌మం చేయ‌బోతున్నట్టు తెలుస్తుంది. ఇండస్ట్రీలో ఉన్న ప్ర‌ముఖ హాస్య న‌టుల్ని ఒకే వేదిక‌పైకి తీసుకొచ్చి వాళ్లంద‌రినీ సన్మానించాలని చూస్తున్నారట. బ్ర‌హ్మానందం, బాబూ మోహ‌న్‌, అలీ, కృష్ణ భ‌గ‌వాన్ మొద‌లుకొని, ఈత‌రం క‌మెడియ‌న్ల‌ని సైతం ఈ వేదికపై సన్మానించాల‌ని భావిస్తున్నారట. ఆమేరకు ఏర్పాటు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.