శాకుంతలం రిలీజ్ డేట్ వాయిదా

shaakuntalam movie release date postponed, shaakuntalam movie New release date, shaakuntalam release date postponed, shaakuntalam New release date, Shaakuntalam Movie Update, Shaakuntalam Telugu Movie Update, Samantha Shakuntalam Movie Latest Update, Shakuntalam Movie Latest Update, Samantha Ruth Prabhu, Samantha's Film Shaakuntalam, Samantha's upcoming Telugu movie, Shaakuntalam Latest Update, Shaakuntalam New Update, Shaakuntalam Telugu Movie, Shaakuntalam Movie, Samantha's Latest Movies, Samantha's Upcoming Movies, Shaakuntalam, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది.మహాభారతంలోని ఆదిపర్వంలో దుష్యంతుడి ప్రేమకథ ఆధారంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు గుణశేఖర్. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాకు విజువల్స్ ఎంత ముఖ్యమో తెలిసిందే కదా. ప్రస్తుతం చిత్రయూనిట్ అదే పనిలో ఉంది. ప్రేక్షకులకు విజులవల్ ట్రీట్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇక ఈసినిమాను నవంబర్ 4వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈసినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది. ఈవిషయాన్ని తెలియచేస్తూ చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈనేపథ్యంలో మేకర్స్…మేము శాకుంతలం సినిమాతో అద్భుతమైన అనుభవాన్ని ప్రేక్షకులను అందివ్వాలని అనుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈ సినిమా 3D వర్షన్‌లో తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఇందుకోసం మరింత సమయం పట్టనుంది. అందుకే ముందుగా ప్రకటించిన తేదీకి సినిమాను విడుదల చేయలేకపోతున్నాం. ప్రపంచం నలుమూలల నుంచి మాపై కురిపించిన మద్దతు, ప్రేమకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సినిమా విడుదల వాయిదా వేస్తున్నందుకు మీ మద్దతు కోసం ఆశిస్తున్నాం. త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం..’ అంటూ మూవీ మేకర్స్ ప్రకటించారు.

కాగా ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తుండగా.. అదితి బాలన్ అనసూయగా, మోహన్ బాబు మహర్షి, అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈసినిమాను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను మొత్తం 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.