3D ఫార్మాట్ లో శాకుంతలం

Shaakuntalam Movie To Be Released In 3D

దిల్ రాజు ప్రొడక్షన్స్ , గుణ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత , దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో శాకుంతలం మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీ లో అదితి బాలన్ , మోహన్ బాబు , ప్రకాష్ రాజ్ , కబీర్ దుహన్ సింగ్ , అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ నటిస్తున్న ఈ మైథలాజికల్ మూవీ శాకుంతలం మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది. తాజా సమాచారం ప్రకారం శాకుంతలం మూవీ ప్రమోషన్స్ ను త్వరలో భారీ ఎత్తున మేకర్స్ చేపట్టనున్నారు.ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్‌ 4న భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని త్రీడీ హంగులతో తీర్చిదిద్దుతున్నారు. అందుకు కొంత సమయం తీసుకుంటుంది. ఈ సందర్భంగా దర్శకుడు గుణ శేఖర్ మాట్లాడుతూ ..త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామనీ , ప్రేక్షకులకు అద్భుతమైన వీక్షణానుభూతిని అందించాలన్నదే మా లక్ష్యం అనీ , సినిమా తాలూకు జ్ఞాపకాల్ని వారు చిరకాలం భద్రపరచుకోవాలనే ఆలోచనతో త్రీడీలో అందించే ప్రయత్నం చేస్తున్నామనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =