టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా, నివేద థామస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా “శాకిని డాకిని”. ఈసినిమా సౌత్ కొరియా యాక్షన్-కామెడీ చిత్రం ‘మిడ్‌నైట్ రన్నర్స్’ కు రీమేక్ గా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా సెప్టెంబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్న షాలిని, దామిని అనే ఇద్దరమ్మాయిలు ప్రమాదకరమైన హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాను ఎలా ఎదుర్కొన్నారనే కథాంశంతో కామెడీ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది. కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన 14 రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి రావడం విశేషం. నేటి నుండి ఈసినిమా ప్రముఖ ఓటీటీ సంస్ధ అయిన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఈసినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈమధ్య ఓటీటీ రూల్స్ కూడా నిర్మాతలు మార్చిన సంగతి తెలిసిందే కదా. రిలీజ్ అయిన కొన్ని వారాల తరువాత రిలీజ్ చేసేలా నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇంత తొందరగా ఓటీటీలో రిలీజ్ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కాగా సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పైఅధికారిక రీమేక్ గా నిర్మాతలు డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు రిచర్డ్ ప్రసాద్ కెమెరామెన్‌గా, మిక్కీ మెల్క్రెరీ సంగీత దర్శకుడుగా, విప్లవ్ నైషధం ఎడిటర్ గా పని చేశారు
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























