ఆది పురుష్ టీజర్ పోస్టర్ అప్ డేట్

Adipurush movie teaser poster to be out tomorrow, Adipurush Teaser Poster Update, Prabhas's Adipurush Teaser Poster, Adipurush Teaser Poster, Prabhas, Kriti Sanon, Saif Ali Khan, Om Raut, Adipurush Teaser, Adipurush Telugu Teaser, Prabhas And Kriti Sanon's Adipurush Movie, Prabhas Latest Movie, Prabhas's Upcoming Movie, Adipurush, Adipurush Telugu movie, Adipurush New Update, Adipurush Telugu Movie New Update, Adipurush Movie, Adipurush Latest Update, Adipurush Movie Updates, Adipurush Telugu Movie Live Updates, Adipurush Telugu Movie Latest News, Adipurush Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా సినిమా ఆది పురుష్. హిందూ మైథలాజికల్ ఫిల్మ్ గా భారీ బడ్జెట్ తో ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అయితే ఈసినిమాకు గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ మెయిన్ కాబట్టి ఈసినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ పనులకే ఎక్కువ టైమ్ పడుతుంది. అందుకే షూటింగ్ చాలా త్వరగా పూర్తయింది కానీ ఎప్పటి నుండో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోనే ఉంది ఈసినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇన్ని రోజులు ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కు రెండు రోజుల క్రితమే సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుండి టీజర్ అక్టోబర్ 2వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న అప్ డేట్ వచ్చినందుకు ఫ్యాన్స్ అయితే సంతోషంలో ఉన్నారు. ఇక ఇప్పుడు ఆ ఆనందాన్ని మరింత రెట్టింపు చేసే అప్ డేట్ ఇచ్చారు. టీజర్ రిలీజ్ కు ముందే టీజర్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. రేపు అంటే సెప్టెంబర్ 30వ తేదీన ఉదయం 11 గంటల 7 నిమిషాలకు పోస్టర్ రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతూ పోస్టర్ కోసం ఇప్పటి నుండే వెయిట్ చేస్తున్నారు. అయోధ్యలో ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.

కాగా ఈసినిమాలో రాముని పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈసినిమా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =