
ట్యాగ్ · 1767 కథనాలు · పేజీ 73


కిచెన్‌లో సన్నీ లియోన్

కన్నడ హీరో యష్ ఫేవరేట్ హీరోయిన్

కొడుకు గురించి కాజల్ ఎమోషనల్ పోస్ట్..!

బీస్ట్ బ్యూటీ పూజా హెగ్డే

మహేష్ బాబు ,ఎన్టీఆర్ లపై రామ్ చరణ్ కామెంట్స్

డైనమిక్ లేడీ డైరెక్టర్‌తో కె.జి.యఫ్ మేకర్స్..!

కన్నడ ప్రేక్షకులకు 'న్యాచురల్ స్టార్' సారీ..!

'ఆచార్య' కు సూపర్ స్టార్ వాయిస్ ఓవర్..!

విజయ్ దేవరకొండ "#VD 11"మూవీ ప్రారంభం

టాలీవుడ్ స్టార్స్ తో చేయడానికి కారణం అదే..!

పాన్ ఇండియా మూవీస్ అంటే - హీరో నాని

'సలార్'.. మోస్ట్ వయోలెంట్ గా ప్రభాస్..!

'RC 15' అమృత్ సర్ షెడ్యూల్ కంప్లీట్..!

'అశోక వనంలో అర్జున కళ్యాణం' ట్రైలర్ రిలీజ్

సౌత్ , నార్త్ లలో కన్నడ భామల హవా

కాజల్ అగర్వాల్ కొడుకు పేరు ఇదే..!

3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న నాని "జెర్సీ"

'ఆచార్య' ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు..!
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'ఆచార్య'. ఇక ఈసినిమాలో రామ్ చరణ్ కూడా సిద్ద అనే కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలే ఉండగా.. ఇప్పటివరకూ రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. ఇక ఏప్రిల్ 29న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచారు. ఇక తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఈసినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

కిచెన్‌లో సన్నీ లియోన్
అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా "గాలి నాగేశ్వర రావు " మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాయల్ రాజ్ పుత్ ,సన్నీ లియోన్ కథానాయికలు. మూల కథను ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి అందించగా, ఈ మూవీ కి కథ , స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా స్టార్ రైటర్ కోన వెంకట్ వ్యవహరిస్తున్నారు.అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తు న్నారు. తన కెరీర్‌లో ఇప్పటివరకూ చేయని సరికొత్త పాత్రతో విష్ణు ప్రేక్షకులను అలరించనున్నారు.

కన్నడ హీరో యష్ ఫేవరేట్ హీరోయిన్
"జంబడ హుడిగి "(2007 ) మూవీ తో నటుడిగా శాండల్ వుడ్ కు పరిచయం అయిన యష్ సక్సెస్ ఫుల్ "మొగ్గిన మనసు "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. "రాకీ"మూవీ తో హీరోగా మారి యష్ పలు సూపర్ హిట్ కన్నడ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన "కె జి ఎఫ్ చాప్టర్ 1 "మూవీ ఘనవిజయం సాధించి కన్నడ చిత్ర పరిశ్రమ లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ మూవీ తో యష్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

కొడుకు గురించి కాజల్ ఎమోషనల్ పోస్ట్..!
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తన మాతృత్వాన్ని అనుభవిస్తుంది. 2020 అక్టోబర్ లో గౌతమ్ కిచ్లూ ను వివాహమాడి వివాహబంధంలోకి అడుగుపెట్టింది కాజల్. ఇక వివాహ జీవితాన్ని ఆనందంగా గడుపుతుండగానే ఈ ఏడాది జనవరిలో తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని తెలియచేశారు. ఇక తాజాగా కాజల్ మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు అప్పుడే తన కొడుకు పేరు కూడా అధికారికంగా ప్రకటించారు కాజల్ దంపతలు. నీల్ కిచ్లూ అనే పేరును తమ బిడ్డకు పెడుతూ అధికారికంగా తెలియచేశారు. ఇక ఇప్పటికే గౌతమ్ కిచ్లూ తమ ఇన్ట్సా ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేయగా తాజాగా కాజల్ కూడా నేడు ఎమోషనల్ పోస్ట్ చేసింది.

"సర్కారు వారి పాట"టైటిల్ సాంగ్ రిలీజ్ డేట్ &టైమ్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ ప్రేమికుల రోజు సందర్భంగా “కళావతి” లిరికల్ సాంగ్ ,తరువాత సెకండ్ సింగిల్ పెన్నీ సాంగ్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

బీస్ట్ బ్యూటీ పూజా హెగ్డే
హీరో నాగచైతన్య కథానాయకుడిగా తెరకెక్కిన సక్సెస్ ఫుల్ “ఒక లైలా కోసం “మూవీ తో పూజా హెగ్డే టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.పూజా హెగ్డే కథానాయికగా నటించిన“ఆచార్య “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.“F 3” మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో పూజాహెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

మహేష్ బాబు ,ఎన్టీఆర్ లపై రామ్ చరణ్ కామెంట్స్
కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటించారు. సోనూసూద్ ఒక కీలక పాత్రలో నటించారు. “ఆచార్య ” మూవీ లో హీరోయిన్ రెజీనా ఫస్ట్ టైమ్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. “ఆచార్య” మూవీ లో టెంపుల్ టౌన్ సెట్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను…

డైనమిక్ లేడీ డైరెక్టర్‌తో కె.జి.యఫ్ మేకర్స్..!
కె.జి.యఫ్ ఘన విజయంతో హోంబలే ఫిలింస్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో వచ్చిన ఈసినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక ఆసినిమా ఘన విజయంతో వెంటనే కె.జి.యఫ్ 2 సినిమాను కూడా రూపొందించారు. ఇక ఈసినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈసినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. అయితే కె.జి.యఫ్ 2 సినిమా రిలీజ్ కాకముందే కె.జి.యఫ్ మేకర్స్ అప్పట్లో మరో సినిమాను ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ లీడ్ రోల్ లో ద్విత్వ అనే టైటిల్ తో సినిమా వస్తున్నట్టు ప్రకటించారు. అయితే పునీత్ రాజ్ కుమార్ ఇటీవలే మరణించారు. మరి ఈసినిమాలో…

కన్నడ ప్రేక్షకులకు 'న్యాచురల్ స్టార్' సారీ..!
ఈమధ్య న్యాచురల్ స్టార్ నాని ఏం మాట్లాడినా వివాదాలకు దారి తీస్తున్నాయి. ఇటీవల టికెట్ల రేటు పెంపుపై మాట్లాడగా అప్పట్లో దానిపై పెద్దఎత్తున చర్చలే జరిగాయి. ఇక ఇప్పుడు మరోసారి నాని చేసిన వ్యాఖ్యలు కన్నడ ప్రేక్షకులకు కోపం తెప్పించాయి.. అసలు సంగతేంటంటే నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న సినిమా అంటే సుందరానికి. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బాలీవుడ్ లో 250 కోట్ల వసూళ్ళతో "కె జి ఎఫ్ చాప్టర్ 2" రికార్డ్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. హీరో యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్, సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.“కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుంది.

'ఆచార్య' కు సూపర్ స్టార్ వాయిస్ ఓవర్..!
ఆచార్య సినిమా కోసం మెగా అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో చిరుతో పాటు చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాను ఎప్పుడు చూద్దామా అని మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక చిరు-చరణ్ సినిమా కావడంతో ఇప్పటికే సినిమాపై హైఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక ఫైనల్ గా ఈనెల 29న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు చిత్రయూనిట్. కొరటాలశివ, చరణ్ ఇప్పటికే ఇంటర్వ్యూలు స్టార్ట్ చేసేశారు.

విజయ్ దేవరకొండ "#VD 11"మూవీ ప్రారంభం
పాన్ ఇండియా "లైగర్ " మూవీ తరువాత విజయ్ దేవరకొండ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కుటుంబ కథా చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "#VD 11"మూవీ పూజ కార్యక్రమంతో ప్రారంభం అయ్యింది. సమంత కథానాయిక. ఈ మూవీ లో సచిన్ ఖేద్కర్ , మురళీశర్మ , లక్ష్మి ,అలీ , రోహిణి , వెన్నెల కిషోర్ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హేషం అబ్దుల్ వాహెబ్ సంగీతం అందిస్తున్నారు.

టాలీవుడ్ స్టార్స్ తో చేయడానికి కారణం అదే..!
అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా కె.జి.యఫ్. 2018లో ఈసినిమా రిలీజ్ అయింది. ఈసినిమా రిలీజ్ అయ్యే సమయానికి నిజానికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యష్ గురించి పెద్దగా ఎవరికీ తెలిసింది లేదు. కానీ ఎప్పుడైతే కె.జి.యఫ్ సినిమా రిలీజ్ అయిందో ఇద్దరూ పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆ సినిమా తరువాత టాలీవుడ్ హీరోల దృష్టి కూడా ప్రశాంత్ నీల్ పై పడింది. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేసే అవకాశం దక్కింది. మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నారు. వీరితో పాటు రామ్ చరణ్, బన్నీ లతో కూడా త్వరలో సినిమాలు చేయనున్నట్టు వార్తలు వచ్చిన…

పాన్ ఇండియా మూవీస్ అంటే - హీరో నాని
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని , మలయాళ బ్యూటీ నజ్రియా జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ జూన్ 10 వ తేదీ రిలీజ్ కానుంది.హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఈ మూవీ లో హీరో నాని కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్ పేరుతో నటిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'సలార్'.. మోస్ట్ వయోలెంట్ గా ప్రభాస్..!
రీసెంట్ గానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు అభిమానులు సలార్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది.ఇక ప్రశాంత్ నీల్ రీసెంట్ గా కె.జి.యఫ్ 2 తో ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో ఇప్పుడు ‘సలార్’ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక గతేడాదే ఈసినిమా సెట్స్ పైకి వెళ్ళి కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక మధ్యలో కరోనా వల్ల, ఆదిపురుష్ వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. మళ్లీ మే ఫస్ట్ వీక్ నుండి తిరిగి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

'RC 15' అమృత్ సర్ షెడ్యూల్ కంప్లీట్..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మెగా హీరోతో శంకర్ సినిమా అంటే ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో చెప్పనవసరం లేదు. రామ్ చరణ్ 15వ సినిమాగా ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతానికి 15 అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ ను జరుపుకుంటుంది.

'అశోక వనంలో అర్జున కళ్యాణం' ట్రైలర్ రిలీజ్
ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంతోమంది యంగ్ హీరోలు తమ టాలెంట్ ను చూపించి ఇండస్ట్రీలో వరుస అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు. ఇక ఆ లిస్ట్ లోకి యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా వస్తాడు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన విశ్వక్ సేన్ ఫలక్ నుమా దాస్ సినిమాతో నటుడిగా మాత్రమే , దర్శకుడిగా కూడా మంచి గుర్తింప తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అయితే విశ్వక్ సేన్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా కూడా ఒకటి. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలుకారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 22న విడుదల చేయనున్నట్లు ఇదివరకే మేకర్స్ ప్రకటించారు. కానీ…

సౌత్ , నార్త్ లలో కన్నడ భామల హవా
"ముగమూడి"మూవీ తో కోలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన పూజాహెగ్డే , హీరో నాగచైతన్య కథానాయకుడిగా తెరకెక్కిన సక్సెస్ ఫుల్ “ఒక లైలా కోసం “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.పూజా హెగ్డే కథానాయికగా నటించిన“ఆచార్య “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. "F 3" మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో పూజాహెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్…

కాజల్ అగర్వాల్ కొడుకు పేరు ఇదే..!
టాలీవుడ్ లో ఎన్నో ఏళ్లు స్టార్ హీరోగా రాణించింది కాజల్ అగర్వాల్. తన నటనతో, అందంతో, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక సౌత్‌లోనే కాదు బాలీవుడ్‌లో కూడా పలువురు స్టార్ హీరోలతో నటించింది. అయితే హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉండగానే వివాహా బంధంలోకి అడుగుపెట్టింది. గౌతమ్ కిచ్లూతో కాజల్ అగర్వాల్ వివాహం అక్టోబర్ 30, 2020లో జరిగింది. కరోనా సమయంలో లాక్ డౌన్ ఆంక్షలు ఉండగానే కొంత మందిని మాత్రమే పెళ్ళికి ఆహ్వానించి వివాహం చేసుకన్నారు.

3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న నాని "జెర్సీ"
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని , శ్రద్ధ శ్రీనాథ్ జంటగా క్రికెట్ నేపథ్యం లో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “జెర్సీ ” మూవీ 2019 ఏప్రిల్ 19 వతేది రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. తన సహజమైన నటనతో నాని సినిమాకు ప్రాణం పోశారు.ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో కళ్ళతో పలికించిన ఎక్స్ ప్రెషన్స్ సినిమాకు హైలైట్ అయ్యాయి. ఈ మూవీ లో హీరో నాని వన్ మ్యాన్ షో తో ప్రేక్షకులను అలరించారు.