పాన్ ఇండియా “లైగర్ ” మూవీ తరువాత విజయ్ దేవరకొండ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కుటుంబ కథా చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “#VD 11″మూవీ పూజ కార్యక్రమంతో ప్రారంభం అయ్యింది. సమంత కథానాయిక. ఈ మూవీ లో సచిన్ ఖేద్కర్ , మురళీశర్మ , లక్ష్మి ,అలీ , రోహిణి , వెన్నెల కిషోర్ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హేషం అబ్దుల్ వాహెబ్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “#VD 11″మూవీ దర్శకుడు హరీష్ శంకర్ క్లాప్ , దర్శకుడు బుచ్చిబాబు సానా స్విఛ్ ఆన్ తో ప్రారంభం అయ్యింది. కొన్ని రోజులలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న “#VD 11″మూవీ ఫస్ట్ షెడ్యూల్ ను కశ్మీర్ లో దర్శకుడు ప్లాన్ చేశారు. తరువాత హైదరాబాద్ , వైజాగ్ , అలెప్పీ లలో షూటింగ్ షెడ్యూల్స్ జరుపుకోనుంది. విజయ్ దేవరకొండ , సమంత బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ లో నటించిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: