
ట్యాగ్ · 1767 కథనాలు · పేజీ 72


"కె జి ఎఫ్ చాప్టర్2" టీమ్ కు ప్రభాస్ అభినందనలు

'కాతు వాకుల రెండు కాదల్' ట్రైలర్ రిలీజ్..!

సెన్సార్ పూర్తిచేసుకున్న 'ఆచార్య'

థాయ్ ల్యాండ్ లో సమంత ఎంజాయ్

రణ్బీర్ కపూర్-రష్మిక 'యానిమల్' షూటింగ్ ప్రారంభం..!

"ధమాకా !" మూవీ అప్ డేట్

175 రోజుల దిశగా "అఖండ "

100 మిలియన్ వ్యూస్ తో "నేను లోకల్"

కీర్తి సురేష్ 'చిన్ని' సినిమా తెలుగు టీజర్ రిలీజ్

'భళా తందనాన' రిలీజ్ డేట్ ఫిక్స్

'విజయ్' తో సినిమాపై 'జాన్వీ' క్లారిటీ..!

#VD 11.. ఫేక్ ఫొటో క్రియేట్ చేసిన విజయ్..!

కన్ఫామ్.. ఆచార్య కోసం మహేష్..!

"జెర్సీ "హిందీ మూవీ టీమ్ కు నాని అభినందనలు

'కె.జి.యఫ్ 2' సక్సెస్ పై యష్ ఎమోషనల్..!

'సర్కారు వారి పాట' టైటిల్ సాంగ్ రిలీజ్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా పరుశురామ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా సర్కారు వారి పాట. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సనిమా అవ్వడం దానికి తోడు ఈసినిమాలో మహేష్ మేకోవర్ మార్చి స్టైలిష్ లుక్ లో కనిపిస్తుండటంతో ఈసినిమాపై అందరికీ ఆసక్తి పెరిగింది. ఇక ఇన్నిరోజులు షూటింగ్ తో బిజీగా ఉన్న ఈసినిమా తాజాగా షూటింగ్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఒకపక్క షూటింగ్ జరుపుకుంటున్నా చెప్పిన డేట్ కే రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్స్, ప్రమోషన్స్ పార్లల్ గా చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికే ప్రమోషన్స్ లో భాగంగా బ్లాస్టర్ పేరుతో గ్లింప్స్, రెండు పాటలు మాత్రమే…

"కె జి ఎఫ్ చాప్టర్2" టీమ్ కు ప్రభాస్ అభినందనలు
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.రవి బస్రూర్ సంగీతం అందించారు. “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ అన్ని భాషలలోను విశేష ప్రేక్షకాదరణ పొందుతుంది.ప్రపంచవ్యాప్తంగా 7 రోజులకు 700 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ కర్ణాటక లో , తెలుగు రాష్ట్రాలలో 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇక…

షూటింగ్ పూర్తిచేసుకున్న 'సర్కారు వారి పాట'
పరుశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈసినిమా ఇన్ని రోజులు షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్నా కూడా మరోపక్క ప్రమోషన్స్ అలానే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా చేస్తున్నారు. ఇక ఇటీవలే ఈసినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుందని ఒక్క పాట షూటింగ్ పెండింగ్ ఉందని తెలిపారు. ఇక ఈ గ్యాప్ లో ఆపాట షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఇప్పుడు తాజాగా సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్నారు చిత్రబృందం. ఈవిషయాన్ని చిత్రయూనిట్ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియచేసింది. అంతేకాదు మే 12 నుంచి బాక్సాఫీస్ రివకరీ షురూ అవుతుందని…

'కాతు వాకుల రెండు కాదల్' ట్రైలర్ రిలీజ్..!
విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, టాలీవుడ్ స్టార్ హీరోయన్ సమంత, సౌత్ లేడీ సూపర్ స్టార్ నయతార లీడ్ రోల్స్ లో వస్తున్న సినిమా చిత్రం కాతువాకుల రెండు కాదల్. ముగ్గురు స్టార్ లతో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఇక తెలుగులో ఖణ్మణి రాంబో ఖతీజా అనే టైటిల్ తో ఈసినిమా రిలీజ్ కానుంది. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైనా కరోనా వల్ల ఎన్నో బ్రేకులు పడ్డాయి. ఫైనల్ గా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమా…

సెన్సార్ పూర్తిచేసుకున్న 'ఆచార్య'
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా సినిమా 'ఆచార్య'. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా కోసం ప్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమా రిలీజ్ ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది. దీంతో ఈసినిమా ప్రమోషన్స్ ను షురూ చేశారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్ ఈసినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక ఈసినిమాలో ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉండగా తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ చోటుచేసుకుంది. ఈసినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు. దీంతో ఈసినిమాపై…

"F 3" మూవీ నుండి "ఊ ఆ అహా అహా లిరికల్ సాంగ్ రిలీజ్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “F 3” మూవీ మే 27 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్ ఒక కీలక పాత్రలో నటించారు. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , దసరా స్పెషల్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

థాయ్ ల్యాండ్ లో సమంత ఎంజాయ్
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం” షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకుంది. సమంత, నయనతార ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “కాతు వాకుల రెండు కాదల్ “ తమిళ మూవీ ఏప్రిల్ 28 వ తేదీ రిలీజ్ కానుంది. సమంత ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీలో నటిస్తున్నారు. ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ , అమెరికన్ వెబ్ సిరీస్ “సిటాడెల్” ఆధారంగా తెరకెక్కించే హిందీ వెబ్ సిరీస్ కు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

రణ్బీర్ కపూర్-రష్మిక 'యానిమల్' షూటింగ్ ప్రారంభం..!
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు సందీప్ వంగా. ఇక ఈసినిమా తరువాత హిందీలో కూడా అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ చేసే ఛాన్స్ ను దక్కించుకున్నాడు. అక్కడ కూడా ఆసినిమా సంచలన విజయం సాధించింది. అంతేకాదు కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టుకుంది. ఆ సినిమా తరువాత అక్కడే బాలీవుడ్ లోనే రణ్ బీర్ తో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు సందీప్. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించారు కూడా. యానిమల్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది.

"ధమాకా !" మూవీ అప్ డేట్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , “పెళ్ళిసందD “మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా మాస్ ఎంటర్ టైనర్ మూవీ ”ధమాకా ” శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ”ధమాకా ” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

175 రోజుల దిశగా "అఖండ "
హీరో నందమూరి బాలకృష్ణ , దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ డిసెంబర్ 2వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్ళు సాధించింది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.

100 మిలియన్ వ్యూస్ తో "నేను లోకల్"
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో నాని , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన "నేను లోకల్" మూవీ 2017 ఫిబ్రవరి 3 వ తేది రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో హీరో నాని క్యారెక్టరైజేషన్ హైలైట్ గా నిలిచింది. నాని తన పంచ్ డైలాగులతో ప్రేక్షకులను అలరించారు. కీర్తి సురేష్ అందంగా కనిపిస్తూనే అద్భుతమైన నటనను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నాని , కీర్తి ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

కీర్తి సురేష్ 'చిన్ని' సినిమా తెలుగు టీజర్ రిలీజ్
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతుంది కీర్తి సురేష్. ఇక ఓ వైపు స్టార్ యాక్టర్స్‌తో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేస్తుంది. ఇప్పటికే పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి సినిమాలతో అలరించగా ఇప్పుడు మరో పాత్ర ప్రధానమైన సినిమాతో వచ్చేస్తుంది. కీర్తీ సురేష్, దర్శకుడు సెల్వ రాఘవన్ నటీనటులుగా తమిళ్ లో ‘సాని కాయిదం’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. అరుణ్ మతేశ్వరన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. తెలుగులో ఈసినిమాను చిన్ని అనే పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఈసినిమాలో డీ గ్లామర్ పాత్రలో కనిపించనుంది కీర్తి…

'భళా తందనాన' రిలీజ్ డేట్ ఫిక్స్
హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరోల్లో శ్రీవిష్ణు కూడా ఒకరు. సినిమా సినిమాకు విభిన్నత చూపిస్తూ డిఫరెంట్ పాత్రలు చేయడంలో శ్రీవిష్ణు ఎప్పుడూ ముందుంటాడు. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో భళా తందనాన సనిమా కూడా ఒకటి. ‘బాణం’ ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, సాంగ్స్ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఇక ఇటీవల ఈసినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్…

'విజయ్' తో సినిమాపై 'జాన్వీ' క్లారిటీ..!
అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఇస్తుందో తెలియదు కానీ తన టాలీవుడ్ ఎంట్రీ పై గతకొద్దికాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే జాన్వీ కపూర్ ఎంట్రీపై ఎన్నో వార్తలు వచ్చాయి. మహేష్ బాబు కు జోడీ అన్నారు.. రామ్ చరణ్ తో అన్నారు.. కానీ అవన్నీ వార్తలకే పరిమితమయ్యాయి. ఈమధ్య కాలంలో ఎన్టీఆర్ తో కూడా సినిమా చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అందులో కూడా నిజం లేదు. ఇప్పుడు తాజాగా మరో న్యూస్ తెరపైకి వచ్చింది.

7 రోజులలో 700 కోట్లతో "కె జి ఎఫ్ చాప్టర్ 2"రికార్డ్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. హీరో యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్, సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.“కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుంది.

#VD 11.. ఫేక్ ఫొటో క్రియేట్ చేసిన విజయ్..!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నాడు. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా తరువాత విజయ్ వెంటనే పూరీతోనే మరో సినిమాను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. పూరీ ఎప్పటినుండో అనుకుంటున్న జనగణమన సినిమానే విజయ్ తో చేయనున్నాడు. ఈసినిమా కోసం ఇప్పటికే తన మేకోవర్ ను కూడా మార్చేశాడు.

కన్ఫామ్.. ఆచార్య కోసం మహేష్..!
2022 లో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ అయిపోయాయి. ఇక వాటిలో ఎప్పటినుండో ఎదురుచూస్తున్న మరో సినిమా ఆచార్య. మెగా అభిమానులు మాత్రమే కాదు సినీ లవర్స్ అందరూ ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమాలో చిరు, చరణ్‌లు మొదటిసారి పూర్తిసాయిలో స్క్రీన్ షేర్ చేసుకుంటుండడంతో ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఈనెల 29వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రబృందం.

"జెర్సీ "హిందీ మూవీ టీమ్ కు నాని అభినందనలు
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని , శ్రద్ధ శ్రీనాథ్ జంటగా క్రికెట్ నేపథ్యం లో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “జెర్సీ ” మూవీ 2019 ఏప్రిల్ 19 వ తేది రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. తన సహజమైన నటనతో నాని సినిమాకు ప్రాణం పోశారు. ఎమోషనల్ సన్నివేశాల్లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నాని ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ మూవీ లో హీరో నాని వన్ మ్యాన్ షో తో ప్రేక్షకులను అలరించారు.

'ఆర్ఆర్ఆర్' దోస్తీ సాంగ్ రిలీజ్..!
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్-ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. భారీ అంచనాల మధ్య మార్చి25న రిలీజ్ అయిన ఈసినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూస్తున్నాం. ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటివరకూ ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1100కోట్ల కలెక్షన్లను సాధించినట్టు తెలుస్తుంది.

'కె.జి.యఫ్ 2' సక్సెస్ పై యష్ ఎమోషనల్..!
కన్నడ సినీ పరిశ్రమకు కె.జి.యఫ్ సినిమా ఎంత గుర్తింపును తెచ్చిందో తెలిసిందే. 2018లో వచ్చిన ఈసినిమా కన్నడ పరిశ్రమలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. సౌత్ లో మాత్రమే కాదు నార్త్ లో కూడా ఈసినిమాకు సూపర్ క్రేజ్ పెరిగింది. ఇక ఈసినిమాకు సీక్వెల్ గురించి కూడా ఎంతో కాలం నుండి ఎదురుచూస్తుండగా రీసెంట్ గానే ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హై ఎక్స్‌పెక్టేషన్స్ నడుమ విడుదలైన ఈ చిత్రం అంచనాలకు ధీటుగానే వసూళ్లను రాబట్టుకుంటోంది. సినిమా విడుదలైన వారం రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 700 కోట్ల గ్రాస్ ను వసూలు చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.