మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని , మలయాళ బ్యూటీ నజ్రియా జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ జూన్ 10 వ తేదీ రిలీజ్ కానుంది.హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఈ మూవీ లో హీరో నాని కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్ పేరుతో నటిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా “అంటే సుందరానికీ !” సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో నాని పాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడుతూ……పాన్ ఇండియా మూవీ అంటే ఏంటో తనకు తెలీదనీ , మన సినిమాకి దేశమంతా మంచి పేరు వస్తే, ఎక్కడెక్కడ ఉన్న తెలుగు వాళ్లంతా మన తెలుగు సినిమా చూసి బాగుందని చెబితే అది పాన్ ఇండియా సినిమా కిందే లెక్కనీ, . తన తరువాత సినిమా “దసరా” దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుందనీ , కానీ అది పాన్ ఇండియా సినిమా కాదనీ , ఇండియాలోని ప్రతి ప్లేస్ లో మన సినిమా రిలీజ్ అయితేనే అది పాన్ ఇండియా సినిమా అని తన ఫీలింగ్ అనీ , అన్ని సినిమాలకు పాన్ ఇండియా సినిమా అనే ట్యాగ్ తగిలించడం వల్ల ఉపయోగం ఏమి లేదనీ , ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా తెలుగు సినిమా బాగుందని తెలుసుకొని దానికోసం వెతికి మరీ ఆ సినిమాలని చూస్తే వాటినే నిజమైన పాన్ ఇండియా సినిమాలు అని అంటారనీ చెప్పారు. హీరో నాని ప్రస్తుతం ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న “దసరా “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: