కొడుకు గురించి కాజల్ ఎమోషనల్ పోస్ట్..!

Kajal Aggarwal emotional post about her son,New Mom Kajal Shares Emotional Note Anushka,Upasana,Raashii,Samantha,Hansika React,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kajal Aggarwa,Actress Kajal Aggarwal,Kajal Aggarwal Blessed with Baby Boy,Kajal Aggarwal Son Name Neli Kitchlu,Kajal Aggarwal Emotional Note, Kajal Aggarwal Shares Emotional In Social Media,Kajal Aggarwal Shares a Emotional in Social Media Goes Viral,Kajal Aggarwal Emotional Note Goes Viral In Social Media, Star Actress React to Kajal Aggarwal Emotional Note,Kajal Aggarwal Son Name Neil

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తన మాతృత్వాన్ని అనుభవిస్తుంది. 2020 అక్టోబర్ లో గౌతమ్ కిచ్లూ ను వివాహమాడి వివాహబంధంలోకి అడుగుపెట్టింది కాజల్. ఇక వివాహ జీవితాన్ని ఆనందంగా గడుపుతుండగానే ఈ ఏడాది జనవరిలో తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని తెలియచేశారు. ఇక తాజాగా కాజల్ మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు అప్పుడే తన కొడుకు పేరు కూడా అధికారికంగా ప్రకటించారు కాజల్ దంపతలు. నీల్ కిచ్లూ అనే పేరును తమ బిడ్డకు పెడుతూ అధికారికంగా తెలియచేశారు. ఇక ఇప్పటికే గౌతమ్ కిచ్లూ తమ ఇన్ట్సా ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేయగా తాజాగా కాజల్ కూడా నేడు ఎమోషనల్ పోస్ట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘నా కొడుకు నీల్‌ను ఈ ప్ర‌పంచంలోకి ఆహ్వానించ‌డం ఎంతో ఎగ్జ‌యిటింగ్‌గా అనిపించింది. నా బిడ్డ‌ను ఎప్పుడెప్పుడు ఎత్తుకుందామా అనే ఫీలింగ్‌ను ఆనందంగా అనుభ‌వించాను. నీల్ మొద‌టిసారి నా ఛాతిపై ప‌డుకున్న‌ప్ప‌టి క్ష‌ణాన్ని నా జీవితంలో మ‌ర‌చిపోలేను. ప్రేమ‌కు సంబంధించి లోతైన భావ‌న‌ను అనుభ‌వించాను. నేను పూర్తి చేయాల్సిన బాధ్య‌త‌ను గుర్తు చేసుకున్నాను. మూడు నిద్ర లేని రాత్రుల‌ను గ‌డిపాను.టెన్షన్‌తో తెలియ‌ని ఆందోళ‌న‌కు లోన‌య్యాను. ఇదంతా ఆక‌ర్ష‌ణీయంగా ఉండ‌క‌పోవ‌చ్చు కానీ.. అందంగా మాత్రం ఉంది’’ అని తెలిపింది కాజల్ అగర్వాల్.

కాగా కాజల్‌ నటిస్తున్న `ఆచార్య` సినిమా ఈనెల 29న విడుదల కాబోతుండటం విశేషం.కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో చిరంజీవి హీరోగా, రామ్‌చరణ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాజల్ ఈ మూవీలో చిరంజీవికి జంటగా నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − twelve =