డైనమిక్ లేడీ డైరెక్టర్‌తో కె.జి.యఫ్ మేకర్స్..!

KGF makers announced new movie with Dynamic Kadu Director,KGF Producers Announce Their Next Movie With A Female Director,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, KGF,KGF Movie,KGF Movie producer,KGF movie Producer Announce next Movie with a Female Director,KGF Director movie with Female Director,KGF Producer Announce Movie with Female Director, Hombale Films Anounce Next movie with Female Director,Hombale Films Next Movie with Female Director Sudha Kongara,Director Sudha Kongara,

కె.జి.యఫ్ ఘన విజయంతో హోంబ‌లే ఫిలింస్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో వచ్చిన ఈసినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక ఆసినిమా ఘన విజయంతో వెంటనే కె.జి.యఫ్ 2 సినిమాను కూడా రూపొందించారు. ఇక ఈసినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈసినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. అయితే కె.జి.యఫ్ 2 సినిమా రిలీజ్ కాకముందే కె.జి.యఫ్ మేకర్స్ అప్పట్లో మరో సినిమాను ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ లీడ్ రోల్ లో ద్విత్వ అనే టైటిల్ తో సినిమా వస్తున్నట్టు ప్రకటించారు. అయితే పునీత్ రాజ్ కుమార్ ఇటీవలే మరణించారు. మరి ఈసినిమాలో పునీత్ ప్లేస్ లో వేరే హీరోను రీ ప్లేస్ చేస్తారా? లేక సినిమాను ఆపేస్తారా అన్నది చూడాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు మరో కొత్త సినిమాను కె.జి.యఫ్ మేకర్స్ ప్రకటించారు. ‘గురు’, ‘ఆకాశం నీ హద్దురా’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైనమిక్ లేడీ డైరెక్టర్ సుధ కొంగరతో తమ తరువాత సినిమాను ప్రకటించారు. తాజాగా నిర్మాణ సంస్థ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. యధార్థ సంఘటనల ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించనున్నట్టు తెలిపారు. ఇక ఈ సినిమాను విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + three =