
ట్యాగ్ · 1767 కథనాలు · పేజీ 22


ప్రారంభం అయిన "చంద్రముఖి 2"

50 రోజులు పూర్తి చేసుకున్న 'ఎఫ్ 3'

"మాచర్ల నియోజకవర్గం" మూవీ లో రాజప్ప లుక్ రిలీజ్

'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' లో కీరవాణి..!

ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో "#RC16 "

'కిరణ్' కొత్త సినిమా టైటిల్ రిలీజ్..!

అభిమానులకు హీరో రామ్ థ్యాంక్స్

ప్రముఖ నటుడు 'ప్రతాప్ పోతెన్' మృతి

అనుపమ - రెజీనా మూవీ టైటిల్ రిలీజ్..!

"మేజర్ "మూవీ దర్శకుడి సక్సెస్ పార్టీ

'వినరో భాగ్యము విష్ణు కథ' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్..!

"గాడ్ ఫాదర్ "మూవీ తాజా షెడ్యూల్

"లడ్ కీ " మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ -అమితాబ్

"జైలర్ "మూవీ కై హైదరాబాద్ లో భారీ సెట్స్

కంగనా రనౌత్ "ఎమర్జెన్సీ " మూవీ టీజర్ రిలీజ్
ఝాన్సీ లక్ష్మీభాయి, "తలైవి" జయలలిత వంటి పాత్రలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఆకట్టుకున్న స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇప్పుడు అత్యంత శక్తివంతమైన మహిళా ప్రధానిగా పేరు తెచ్చుకున్న ఇందిరా గాంధీ పాత్ర తో ప్రేక్షకులను అలరించనున్నారు. కంగనా రనౌత్ దర్శకత్వంలో కంగనా ప్రధాన పాత్రలో "ఎమర్జెన్సీ "హిందీ మూవీ తెరకెక్కుతుంది.

భారీ సాంగ్ తో "పొన్నియిన్ సెల్వన్ 1"
మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా “పొన్నియిన్ సెల్వన్ “తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయంరవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్‌కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

ప్రారంభం అయిన "చంద్రముఖి 2"
శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ , నయనతార , జ్యోతిక , ప్రభు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కామెడీ హారర్ “చంద్రముఖి” తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. చంద్రముఖి పాత్రలో జ్యోతిక అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు “చంద్రముఖి “సీక్వెల్ “చంద్రముఖి 2 ” మూవీ తెరకెక్కనుంది.

'సీతారామం' గౌతమ్ మీనన్ ఫస్ట్ లుక్ రిలీజ్..!
కూల్ డైరెక్టర్ హనురాఘవపూడి నుండి మరో ప్రేమకథ సీతారామం. దుల్కర్ సల్మాన్ హీరోగా పీరియాడిక్ లవ్ డ్రామాగా ఈసినిమా వస్తుంది. ఈసినిమాలో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో నటిస్తున్నాడు దుల్కర్ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఎప్పటినుండో మొదలుపెట్టేశారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమాలో నటిస్తున్న కీలక పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈసినిమాలో రష్మిక కశ్మీరీ యువతి అఫ్రీన్‌గా నటిస్తుండగా..సుమంత్ బ్రిగేడియర్ విష్ణు శర్మగా నటిస్తున్నాడు. రెండు రోజుల క్రితమే తరుణ్ భాస్కర్ లుక్ ను రిలీజ్ చేశారు. తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో బాలాజీ పాత్రలో నటిస్తున్నాడు…

50 రోజులు పూర్తి చేసుకున్న 'ఎఫ్ 3'
అనిల్ రావిపూడి దర్శకత్వంలో 2019లో వచ్చిన ఎఫ్ 2 సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే కదా. వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈసినిమా ప్రేక్షకులకు అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ ను అందించింది. ఇక ఎఫ్ 2 సీక్వెల్ గా ఎఫ్ 3 సీక్వెల్ ను తెరకెక్కించాడు అనిల్. భారీ అంచనాల నడుమ మే 27న విడుదలైన ఈ సీక్వెల్ ఆ అంచనాలను నిజం చేస్తూ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రెట్టింపు ఎంటర్ టైన్ మెంట్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఈసినిమా. వెంకీ, వరుణ్‌ల కామెడీ టైమింగ్ తో.. అనిల్ రావిపూడి మేకింగ్ తో ప్రేక్షకులు మరోసారి నవ్వుకునేలా చేశారు.

"మాచర్ల నియోజకవర్గం" మూవీ లో రాజప్ప లుక్ రిలీజ్
రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ , శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్స్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్ ,బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతి శెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ “మాచర్ల నియోజకవర్గం” మూవీ ఆగస్ట్ 12వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో క్యాథరీన్ మరో కథానాయిక. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీలో విలన్ గా సముద్ర ఖని నటిస్తున్నారు. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “మాచర్ల నియోజకవర్గం” మూవీ పోస్టర్‌లు, గ్లింప్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' లో కీరవాణి..!
రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించగా ఇప్పటివరకూ ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాము మొక్కలు నాటడంతో పాటు మరికొందరిని నామినేట్ చేస్తూ.. వారు కూడా మొక్కలు నాటేలా చేస్తూ..అందరూ కలిసి విజయవంతంగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ముందుకు తీసుకెళుతున్నారు.

ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో "#RC16 "
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో“#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో అంజలి , జయరామ్ , శ్రీకాంత్ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. #RC15 ” మూవీ హైదరాబాద్, పూణె, రాజమండ్రి , అమృత్ సర్ షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి.

'కిరణ్' కొత్త సినిమా టైటిల్ రిలీజ్..!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాత్రం వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం కిరణ్ కార్తీక్ శంకర్ దర్శకత్వంలో నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా దాదాపు షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇక ఈ సినిమాని కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మాణం వహిస్తుండగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. దీనితో పాటు వినరో భాగ్యము విష్ణు కథ సినిమాను కూడా చేస్తున్నాడు. ఇక దీనితో పాటు గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో కూడా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వినరో భాగ్యము విష్ణు కథ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమా కూడా ప్రస్తుతం…

అభిమానులకు హీరో రామ్ థ్యాంక్స్
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతి శెట్టి జంటగా ఫ్యాక్షన్ నేపథ్యం లో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ది వారియర్ ” మూవీ జూలై 14 వ తేదీ రిలీజ్ అయ్యి విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన “ది వారియర్”మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.డాక్టర్గా, పోలీస్గా, లవర్గా రామ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. హీరో రామ్ , విలన్ ఆది పినిశెట్టి పోటాపోటీ గా నటించి ప్రేక్షకులను…

ప్రముఖ నటుడు 'ప్రతాప్ పోతెన్' మృతి
సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా మృత్యువాత పట్టడంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. ఎంతోమంది లెజెండరీ నటీనటుల్నీ ఎంతోమంది కళాకారులను కోల్పోయింది చిత్ర పరిశ్రమ. ఇప్పుడు మరో సీనియర్ నటుడిని కోల్పోవాల్సి వచ్చింది. ఆ సీనియర్ నటుడు ఎవరో కాదు మలయాళం యాక్టర్, ఫిలిం మేకర్ అయిన ప్రతాప్ కె పోతెన్. నేడు ఉదయం చెన్నైలోని అపార్ట్ మెంట్లో ఆయన తుది శ్వాస విడిచారు. తెలుగు, తమిళ్, మలయాళం ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు, నటీనటులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు.

లాస్ ఏంజెల్స్ లో "ఆదిపురుష్"ఐమాక్స్ వెర్షన్ 3D వర్క్స్
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న “ఆదిపురుష్ ” మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు.హీరో ప్రభాస్ ఫస్ట్ టైమ్ మైథలాజికల్ మూవీ లో నటించిన…

' లాల్ సింగ్ చద్దా' మెగాస్టార్ కోసం స్పెషల్ ప్రివ్యూ..!
ఒకపక్క తెలుగులో సినిమాలు చేస్తూనే మరోపక్క బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు నాగచైతన్య. అమీర్ ఖాన్ హీరోగా వస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మరోవైపు ఈసినిమా టీమ్ కూడా ప్రమోషన్స్ ను మొదులుపెట్టింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది.

అనుపమ - రెజీనా మూవీ టైటిల్ రిలీజ్..!
ఇప్పుడు హీరోయిన్స్ కేవలం గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం అవ్వట్లేదు. ఒకప్పుడు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోపక్క లేడీ ఒరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ కెరీర్ లో హీరోలకు సైతం పోటీగా సినిమాలు చేసుకుంటూ కెరీర్ లలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే సమంత, నయనతార, సాయి పల్లవి ఇలా చాలామంది హీరోయిన్స్ ఇప్పటికే లేడీ ఒరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు. ఎంతోమంది మంచి హిట్లను అందుకుంటున్నారు. ఇక ఇప్పుడు మరో ఇద్దరు హీరోయిన్లు కలిసి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆహీరోయిన్స్ ఎవరో కాదు అనుపమ పరమేశ్వరన్-రెజీనా కసాండ్ర.

"మేజర్ "మూవీ దర్శకుడి సక్సెస్ పార్టీ
సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా “మేజర్” మూవీ 3వ తేదీ రిలీజ్అయ్యి ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివిశేష్ తన కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అందించారు. అడివి శేష్ కు జోడీగా నటించిన సయీ మంజ్రేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అడివి శేష్ , సయీ ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

'వినరో భాగ్యము విష్ణు కథ' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్..!
టాలీవుడ్ స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా యంగ్ హీరోలు కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అందులో కిరణ్ అబ్బవరం కూడా ఉన్నాడు. రాజావారు రాణివారు సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన కిరణ్ అబ్బవరం మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత ఎస్ఆర్ కళ్యాణమండపంతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. అయితే కిరణ్ కు మాత్రం రెండు సినిమాలకే వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. ఏకంగా మైత్రీ, గీతా ఆర్స్ట్ లాంటి పెద్ద బ్యానర్స్ లలోనే అవకాశాలను అందుకున్నాడు.

"గాడ్ ఫాదర్ "మూవీ తాజా షెడ్యూల్
కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో సూపర్ హిట్ “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ “గాడ్ ఫాదర్ ” మూవీ షూటింగ్ లో చిరంజీవి పాల్గొంటున్నారు. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్, అనసూయ, దర్శకుడు పూరి జగన్నాథ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.మెగాస్టార్” గాడ్ ఫాదర్” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ 4వ తేదీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నెరిసిన వైట్ హెయిర్ తో కూలింగ్…

రామ్ 'ది వారియర్' మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే మాస్ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు ఇష్టపడే వాళ్లకి ఈసినిమా బాగా నచ్చుతుందని చెప్పొచ్చు. ఇక తమిళ్ ప్రేక్షకులను కూడా రామ్ బాగానే తన నటనతో ఆకట్టుకుంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

"లడ్ కీ " మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ -అమితాబ్
ఆర్ట్‌సీ మీడియా, చైనీస్ ప్రొడక్షన్ మేజర్ బిగ్ పీపుల్ బ్యానర్స్ పై రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో పూజా భలేకర్ ప్రధాన పాత్రలో హాలీవుడ్ స్టార్ బ్రూస్ లీ నటించిన ఎంటర్ ది డ్రాగన్ స్ఫూర్తితో, మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో “లడ్‌కీ:ఎంటర్ ది గర్ల్ డ్రాగన్” హిందీ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. మార్షల్ ఆర్ట్స్ హీరో బ్రూస్ లీ స్ఫూర్తితో ముందుకు సాగే యువతిగా పూజా భలేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “లడ్‌కీ:ఎంటర్ ది గర్ల్ డ్రాగన్” మూవీ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషలతో పాటు చైనీస్ భాషలో జూలై 15 వ తేదీ విడుదల కానుంది.ఈమూవీ తెలుగు భాషలో "అమ్మాయి" టైటిల్ తో రిలీజ్ అవుతుంది. చిత్ర యూనిట్…

"జైలర్ "మూవీ కై హైదరాబాద్ లో భారీ సెట్స్
తమిళ , తెలుగు , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ , మేనరిజమ్స్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రజనీకాంత్ తన 169 వ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “డాక్టర్”, “బీస్ట్”మూవీస్ ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “జైలర్ ” తమిళ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో ఐశ్వర్య రాయ్ కథానాయిక పాత్రలో నటించే అవకాశం ఉంది. హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం…