
ట్యాగ్ · 1767 కథనాలు · పేజీ 23


'యశోద' సమంత గట్స్ కి హ్యాట్సాఫ్..!

షూట్ కి రెడీ అవుతున్న 'భవదీయుడు భగత్ సింగ్'

"MEGA 154 " మూవీ సెట్స్ కు రవితేజ

'పిశాచి 2' రిలీజ్ డేట్ ఫిక్స్

'వినరో భాగ్యము విష్ణు కథ' గ్లింప్స్ అప్ డేట్..!

'సీతారామం' తరుణ్ భాస్కర్ రోల్ రివీల్..!

'గాడ్ ఫాదర్' డైరెక్టర్ తో నాగ్ 100 సినిమా..?

క్రేజీ కాంబోతో కె.జి.యఫ్ మేకర్స్..?

నాగచైతన్య పై కృతి శెట్టి ప్రశంసలు

"రంగ రంగ వైభవంగా "మూవీ రిలీజ్ డేట్

గాయమైనా 'ది వారియర్' చేశా..!

"యశోద " మూవీ రిలీజ్ డేట్

"భీమ్లా నాయక్"హిందీ వెర్షన్ రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిత్యామీనన్ , రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ జంటలుగా సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన “భీమ్లా నాయక్ ” మూవీ ఫిబ్రవరి 25 వ తేదీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్, భారీ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించింది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించిన “భీమ్లా నాయక్ ” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు. పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను అలరించారు.

'యశోద' సమంత గట్స్ కి హ్యాట్సాఫ్..!
ఏమాయ చేశావే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సమంత ఆ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఆసినిమా తరువాత సమంత పెద్దగా వెనుక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా అవకాశాలతో మధ్యలో కొన్ని ఫ్లాప్స్ వచ్చినా ఎక్కువ శాతం సక్సెస్ రేటునే సొంతం చేసుకొని లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి సమంత దశాబ్దం అయిపోయింది. అయినా కూడా ఇంకా స్టార్ హీరోయిన్ గా పలు ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తూనే ఉంది.

నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10 లో నెం 1 మూవీ గా "అంటే .. సుందరానికీ !"
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ జూన్ 10 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఈమూవీ లో హీరో నాని తన డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.సంప్రదాయ బ్రాహ్మణ కుర్రాడిగా నటించి ఆ పాత్రకి న్యాయం చేశారు.నజ్రియా నజీమ్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

షూట్ కి రెడీ అవుతున్న 'భవదీయుడు భగత్ సింగ్'
గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భవదీయుడు భగత్ సింగ్. ఈసినిమాను ప్రకటించడానికి అయితే ఎప్పుడో ప్రకటించారు కానీ ఇంతవరకూ సెట్స్ పైకి మాత్రం వెళ్లలేకపోయింది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ చేసినా కూడా షూటింగ్ మొదలుపెట్టలేకపోయారు. దీనికి పలు కారణాలు లేకపోలేదు. పవన్ వేరే సినిమాలతో బిజీగా ఉండటం.. మధ్యలో రాజకీయాలు.. మరోవైపు కరోనా ఇలా పలు కారణలా వల్ల లేట్ అవుతూ వస్తుంది. పవన్ బిజీ షెడ్యూల్ వల్ల ఎప్పుడో మొదలుపెట్టిన హరి హర వీరమల్లు సినిమానే ఇంకా పూర్తి కాలేదు. అది కంప్లీట్ అయితే కానీ ఈసినిమా సెట్స్ పైకి వెళ్లే…

"MEGA 154 " మూవీ సెట్స్ కు రవితేజ
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక . బిజూ మీనన్ , మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.”వాల్తేరు వీరయ్య ”(వర్కింగ్ టైటిల్ ) మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. “వాల్తేరు వీరయ్య “మూవీ లో మెగా స్టార్ చిరంజీవి మత్స్య కారుడిగా , మత్స్య కారులకు నాయకుడిగా ఒక పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'పిశాచి 2' రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళ డైరెక్టర్ మిస్కిన్ దర్శకత్వంలో 2014లో పిశాచి సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. నాగ సాయి ప్రతీష్, ప్రయాగ మార్టీన్ జంటగా నటించిన ఈసినిమా అప్పట్లో ఎంత ఘనవిజయం సాధించిందో కూడా విదితమే. హర్రర్ థ్రిల్లర్‌గా అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఇక ఇప్పుడు దాని సీక్వెల్ పిశాచి2 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈసినిమా కూడాఎప్పుడో మొదలై మద్యలో కరోనా రావడంతో షూటింగ్ ఆలస్యమువుతూ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చిన్నగా మొదలుపెట్టారు. ఇప్పటికే టీజర్ ను కూడా రిలీజ్ చేయగా అది సూపర్…

'పొన్నియన్ సెల్వన్' 5 భాషల్లో విక్రమ్ డబ్బింగ్..!
మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న సినిమా పొన్నియన్ సెల్వన్. రెండు పార్ట్ లుగా వస్తున్న ఈసినిమా మొదటి పార్ట్ సెప్టెంబర్ 30న రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. టీజర్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈసినిమాపై టీజర్ తో అంచనాలను మరింత పెంచారు.

'వినరో భాగ్యము విష్ణు కథ' గ్లింప్స్ అప్ డేట్..!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాత్రం ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే సమ్మతమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆసినిమా అనుకున్నతం విజయాన్ని అయితే అందించలేకపోయింది. అయినా కూడా ఎలాంటి నిరాశ చెందకుండా తన తరువాత సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమా పూర్తి చేస్తున్నాడు. ఈసినిమా టీజర్ కూడా ఇప్పటికే రిలీజ్ అయింది కూడా. ఇక ఈసినిమాతో పాటు వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమా కూడాచేస్తున్నాడు కిరణ్. ప్రస్తుతం అయితే ఈసినిమా షటింగ్ దశలో ఉంది.

'సీతారామం' తరుణ్ భాస్కర్ రోల్ రివీల్..!
హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న సినిమా సీతారామం. పీరియాడిక్ లవ్‌స్టోరీతో వార్ బ్యాక్ డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు హనురాఘవపూడి. ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఒక అప్ డేట్ తరువాత మరో అప్ డేట్ ఇస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, గ్లింప్స్, వరుసగా పోస్టర్లు రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. రెండు రోజులు క్రితమే ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సుమంత్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈసినిమాలో నటిస్తున్న మరో కీలక…

తెలుగు లో ఛాలెంజింగ్ స్క్రిప్ట్ కై ఎదురుచూస్తున్నా - రకుల్ ప్రీత్
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రకుల్ ప్రీత్ సింగ్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా తెరకెక్కిన “డాక్టర్ జీ”, “థ్యాంక్ గాడ్” , “మిషన్ సిండ్రెల్లా “, “చ్ఛాత్రివాలి ” ( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “ (తమిళ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఒక కామెడీ వెబ్ సిరీస్ తో పాటు తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “31 అక్టోబర్ లేడీస్ నైట్ ” మూవీ లో రకుల్ నటిస్తున్నారు. అజిత్ హీరోగా తెరకెక్కనున్న “#AK 61 ” మూవీలో రకుల్ కథానాయికగా ఎంపిక అయ్యారు.

"ఆర్ ఆర్ ఆర్ " మూవీ లో చిరుత తో ఎన్టీఆర్ ఫైట్ సీన్ వీఎఫ్ఎక్స్ వర్క్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. “ఆర్ ఆర్ ఆర్”మూవీ హిందీ వెర్షన్ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవడం తో గ్లోబల్ గా…

'గాడ్ ఫాదర్' డైరెక్టర్ తో నాగ్ 100 సినిమా..?
టాలీవుడ్ లో అగ్రహీరోలు కూడా యంగ్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అయితే ఒకేసారి రెండు మూడు సినిమాలు కాదు కానీ ఒక సినిమా తరువాత ఒక సినిమాను చేసుకుంటూ వెళుతున్నారు. ఇక నాగార్జున కూడా అదే బాటలో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా ది ఘోస్ట్ సినిమా వస్తుంది. యాక్షన్ స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా కనిపిస్తున్నారు. వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

క్రేజీ కాంబోతో కె.జి.యఫ్ మేకర్స్..?
కె.జి.యఫ్ సినిమా తర్వాత హూంబలే బ్యానర్ పై పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ నుండి వచ్చిన కె.జి.యఫ్, కె.జి.యఫ్2 ఎంత సంచలన విజయాలు అందించాయో చూశాం. ప్రస్తుతం ఈబ్యానర్ నుండి పలు పెద్ద ప్రాజెక్టులు, ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లో సినిమాలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్‌తో సాలార్, పృథ్వీరాజ్ సుకుమారన్‌తో టైసన్, డా.సూరితో బగీరా మరియు రక్షిత్ శెట్టితో రిచర్డ్ ఆంటోని వంటి హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లను తెరకెక్కిస్తున్నారు. వీటితో పాటు లెజెండ్ డా.రాజ్‌కుమార్ మనవడు యువ రాజ్‌కుమార్‌ను కూడా పరిచయం చేస్తుంది.

నాగచైతన్య పై కృతి శెట్టి ప్రశంసలు
బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతి శెట్టి, ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “ఉప్పెన “, “శ్యామ్ సింగ రాయ్” , “బంగార్రాజు ” మూవీస్ తో కృతి శెట్టి హ్యాట్రిక్ సాధించారు.సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతి శెట్టి ప్రస్తుతం “ది వారియర్ “, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”,“మాచర్లనియోజకవర్గం” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.బాలా దర్శకత్వంలో సూర్య , అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వంలో హీరో ధనుష్ నటించే తమిళ మూవీస్ లో కృతి కథానాయికగా ఎంపిక అయ్యారు.

"రంగ రంగ వైభవంగా "మూవీ రిలీజ్ డేట్
బ్లాక్ బస్టర్ “ఉప్పెన” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజా వైష్ణవ్ తేజ్ “కొండపొలం” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.ఇప్పుడు మరో మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. బాపినీడు సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా “రంగ రంగ వైభవంగా” మూవీ తెరకెక్కింది. ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

'రామారావు ఆన్ డ్యూటీ' యాక్షన్ మేకింగ్ వీడియో రిలీజ్..!
శరత్ మండవ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా రాబోతుంది. ఈసినిమా ఈసినిమా రిలీజ్ అవ్వాలి కానీ రిలీజ్ కూడా చాలా లేట్ అయింది. ఫైనల్ గా ఈసినిమాను జులై 29న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఇక ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక ట్రైలర్ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. జులై 16వ తేదీన ఈసినిమా ట్రైలర్ రిలీజ్ కానుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈసినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు. మేకింగ్ వీడియో అంతా సినిమాలోని ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌కి సంబంధించిన…

గాయమైనా 'ది వారియర్' చేశా..!
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో వస్తున్న సినిమా ది వారియర్. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈసినిమా ఈ శుక్రవారం (జులై 14) థియేటర్లలోకి రానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు చిత్రబృందం. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

"విక్రమ్ " మూవీ ఓటీటీ రికార్డ్
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి.అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్,అతిథి పాత్రలో నటించిన స్టార్ హీరో సూర్య తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.“విక్రమ్” మూవీ ఘనవిజయం సాధించడంతో విమర్శకులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ప్రశంసిస్తున్నారు.

"యశోద " మూవీ రిలీజ్ డేట్
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో “యశోద” మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే.ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా సైంటిఫిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న “యశోద ” మూవీలో కీలక యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ తెరకెక్కించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “యశోద” మూవీ పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'కార్తికేయ 2' ఫస్ట్ సింగిల్ రిలీజ్..!
చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా కార్తికేయ 2. నిఖిల్ కెరీర్ ను ఒక మలుపు తిప్పిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా ఈసినిమా వస్తుంది. నిజానికి ఈసినిమా షూటింగ్ కే చాలా గ్యాప్ వచ్చింది. షూటింగ్ మొదలైన తరువాత కరోనా వల్ల కొన్ని నెలలు వాయిదా పడింది. ఫైనల్ గా ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసి జులై 22న రిలీజ్ చేద్దామని అనుకున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా రిలీజ్ అవుతుంది అనుకునే లోపు రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు. ఈసందర్భంగా నిఖిల్ క్షమాపణలు చెబుతూ పోస్ట్ కూడా చేశాడు. జులై22న విడుదల కావాల్సిన ఈసినిమాను ఆగష్ట్ కు వాయిదా వేశారు.