‘సీతారామం’ గౌతమ్ మీనన్ ఫస్ట్ లుక్ రిలీజ్..!

Gautham Menon First Look from Sitaramam Movie Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sitaramam,Sitaramam Movie,Sitaramam Telugu Movie,Sitaramam Movie Updates,Gautham Menon,Gautham Menon Latest Movie Updates,Gautham New Movie Updates, Gautham Menon First Look Released From Sitaramam Movie,Gautham Menon Sitaramam Movie First Look Releaseb,Gautham Menon Upcoming Movie Sitaramam,

కూల్ డైరెక్టర్ హనురాఘవపూడి నుండి మరో ప్రేమకథ సీతారామం. దుల్కర్ సల్మాన్ హీరోగా పీరియాడిక్ లవ్ డ్రామాగా ఈసినిమా వస్తుంది. ఈసినిమాలో లెఫ్టినెంట్ రామ్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు దుల్కర్ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఎప్పటినుండో మొదలుపెట్టేశారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమాలో నటిస్తున్న కీలక పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈసినిమాలో ర‌ష్మిక క‌శ్మీరీ యువ‌తి అఫ్రీన్‌గా నటిస్తుండగా..సుమంత్ బ్రిగేడియ‌ర్ విష్ణు శ‌ర్మ‌గా న‌టిస్తున్నాడు. రెండు రోజుల క్రితమే త‌రుణ్ భాస్క‌ర్ లుక్ ను రిలీజ్ చేశారు. త‌రుణ్ భాస్క‌ర్ ఈ చిత్రంలో బాలాజీ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇప్పుడు మరో కీలక పాత్రలో నటిస్తున్న గౌతమ్ మీనన్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. గౌతమ్ మీనన్ ఈసినిమాలో మేజర్ సెల్వన్ పాత్రలో నటిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా వైజయంతి మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్న సినిమాస్ ప‌తాకంపై అశ్విని దత్‌, ప్రియాంక్‌ దత్‌ నిర్మిస్తున్న ఈసినిమాలో మృణాళిని ఠాకూర్ కూడా నటిస్తుంది. ఇంకా ప్రకాష్ రాజ్, రాహుల్ రవీంద్ర పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు పీఎస్ వినోద్ సినిమాట్రోగాఫర్ గా పనిచేస్తున్నారు. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం భాష‌ల్లో ఆగ‌ష్ట్ 5న థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 12 =