తమిళ , తెలుగు , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ , మేనరిజమ్స్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రజనీకాంత్ తన 169 వ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “డాక్టర్”, “బీస్ట్”మూవీస్ ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “జైలర్ ” తమిళ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో ఐశ్వర్య రాయ్ కథానాయిక పాత్రలో నటించే అవకాశం ఉంది. హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. డ్యూయల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో నటించనున్న రజనీకాంత్‌లోని మాస్, హీరోయిజం హంగులను కొత్త పంథాలో ఆవిష్కరిస్తూ, భారీ యాక్షన్ సీన్స్ తో “జైలర్ “మూవీ ని దర్శకుడు నెల్సన్ తెరకెక్కించనున్నట్లు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కోలీవుడ్ స్టార్ హీరోలు రజనీకాంత్ , అజిత్ కుమార్ తమ సినిమాల షూటింగ్స్ హైదరాబాద్ లో జరపడానికి ఆసక్తి చూపుతున్నారు.రజనీకాంత్ “అన్నాత్తే “, అజిత్ “వాలిమై” మూవీస్ మేజర్ షూటింగ్ పార్ట్ హైదరాబాద్ లో జరుపుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు “జైలర్ ” మూవీ మేజర్ షూటింగ్ పార్ట్ ను మేకర్స్ హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. “జైలర్ “మూవీ కై రామోజీ ఫిల్మ్ సిటీ లో భారీసెట్స్ రూపొందుతున్నాయనీ , వచ్చేనెల నుంచి ఈ సెట్స్ లో షూటింగు మొదలుకానుందనీ సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: