‘ఇద్దరి లోకం ఒకటే’ ట్రైలర్ రిలీజ్

‘లవర్ ‘ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని కొత్త సినిమాతో రాబోతున్నాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ హీరో గా, అర్జున్ రెడ్డి భామ షాలిని పాండే హీరోయిన్ గా.. జి.ఆర్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘ఇద్దరి లోకం ఒకటే’. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీన రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను పాటలను రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో నాజర్, మాస్టర్ భరత్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జి.ఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాకు అబ్బూరి రవి సంభాషణలు సమకూర్చుతున్నారు. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు మిక్కీ జె. మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.మరి ఈ సినిమాతో అయినా రాజ్ తరుణ్ మంచి కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.