వారం గ్యాప్ లో వ‌స్తున్న మామాఅల్లుళ్ళు

Rajinikanth And Dhanush Movies Set To Release Within A Week Gap

2020 పొంగ‌ల్… త‌మిళ తంబీల‌కు ఎంతో ప్ర‌త్యేకం కానుంది. ఎందుకంటే… ఈ సారి సంక్రాంతికి కోలీవుడ్ మామాఅల్లుళ్ళు బాక్సాఫీస్ వ‌ద్ద వినోదాలు పంచ‌డానికి సిద్ద‌మ‌య్యారు. వారం రోజుల గ్యాప్ లో ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుండ‌డం కోడంబాక్కం లో హాట్ టాపిక్ గా మారింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే…. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ న‌టించిన కాప్ డ్రామా `ద‌ర్బార్` జ‌న‌వ‌రి 9న విడుద‌ల కానుండ‌గా… అత‌ని అల్లుడు, సెన్సేష‌న‌ల్ స్టార్ ధ‌నుష్ ద్విపాత్రాభిన‌యంలో తెర‌కెక్కిన `ప‌ట్టాస్` జ‌న‌వ‌రి 16న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అంటే… స‌రిగ్గా వారం రోజుల గ్యాప్ లో ఈ మామాఅల్లుళ్ళ చిత్రాలు సెల్యులాయిడ్ పైకి రాబోతున్నాయ‌న్న‌మాట‌.

వాస్త‌వానికి, కొన్నాళ్ళ క్రిత‌మే `ద‌ర్బార్`, `ప‌ట్టాస్` సంక్రాంతి బ‌రిలో ఉంటాయ‌ని వార్త‌లు వినిపించాయి. అయితే, విడుద‌ల తేదీల‌ విష‌యంలో స్ప‌ష్ట‌త రాలేదు. ఇప్పుడు ఆ క్లారిటీ కూడా వ‌చ్చేసింది. మ‌రి… మామాఅల్లుళ్ళు పంచే వినోదాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద కాసులవ‌ర్షం ఏ స్థాయిలో కురుస్తుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.