ఒక్క సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ వంగ. విజయ్ దేవరకొండ, షాలిని పాండే హీరో హీరోయిన్లు గా తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సంచలన విజయం సాధించి కొత్త ట్రెండ్ కు నాంది పలికాడు. ఇక ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉండగా ఇదే సినిమాను షాహిద్ కపూర్, కియారా అద్వాని హీరో హీరోయిన్లు గా హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. కబీర్ సింగ్ మూవీ ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. హీరో షాహిద్ కపూర్ సినీ కెరీర్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సందీప్ తన తర్వాత సినిమా హిందీలోనే తీస్తున్న సంగతి తెలిసిందే. కబీర్ సింగ్ మూవీ నిర్మాతలే ఈ సినిమాను కూడా నిర్మించనున్న సంగతి విదితమే. సందీప్ రెడ్డి సోదరుడు ప్రణయ్ వంగ కూడా ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా ఉండనున్నాడు. అయితే ఈసారి క్రైమ్ డ్రామా గా ఈ సినిమా వుండబోతున్నట్టు తెలుస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఒక కథను సందీప్ రెడ్డి వినిపించడంతో, వాళ్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ ఇదొక పాన్ ఇండియా సినిమా అని క్రైమ్ డ్రామాగా ఉండబోతోందని అన్నారు. అంతేకాదు సందీప్ వంగ సినిమాలు భిన్నంగా ఉంటాయని, ఆయనతో ఇంకొన్ని సినిమాలు చేయడానికి సిద్దమవుతున్నామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందట. త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారట. మొత్తానికి సందీప్ వంగకు బాలీవుడ్ లో మంచి ప్లేసే దక్కింది. చూద్దాం మరి హిందీలోనే సినిమాలో తీసుకుంటూ వెళతాడా..?లేక తెలుగులో కూడా తెస్తాడా..?
[subscribe]



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























