త్రివిక్రమ్ తోనే తర్వాత సినిమా..!

NTR To Team Up With Trivikram Srinivas Again

ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక గతకొద్ది కాలంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా వున్న ఎన్టీఆర్ కూడా తన తర్వాత సినిమా కోసం ఇప్పటినుండే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ తన తర్వాత సినిమాను త్రివిక్రమ్ తో చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే దీనిపై ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయట. స్క్రిప్ట్ పనులు త్వరలోనే మొదలుపెట్టనున్నాడట త్రివిక్రమ్. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా త్రివిక్రమ్ ప్రస్తుతం ‘అల వైకుంఠపురములో’ సినిమాతో బిజీ గా వున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. హారిక-హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.