కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Updates

ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 78

Vijay Deverakonda Donates For Pulwama Attack Victims,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Actor Vijay Deverakonda Latest News,Vijay Deverakonda donation to Pulwama Soldiers,Vijay Deverakonda Donati
సినిమా వార్తలు

సైనిక కుటుంబాలకు గుప్తదానం

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా లో జరిగిన ఉగ్రదాడి లో నలభై మంది కి పైగా సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. సాధారణ ప్రజల నుండి సెలబ్రిటీస్ వరకు తమ సానుభూతిని ట్వీట్స్ ద్వారా తెలియజేస్తున్నారు. కానీ హీరో విజయ్ దేవరకొండ ఒక అడుగు ముందుకు వేసి సైనిక కుటుంబాలను ఆదుకొనడానికి సాయమందించి, ప్రజలందరినీ సాయం చేయమని కోరారు.

Team TFNవాట్సాప్
Latest Telugu Movies Box Office Collections,,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Yatra Movie Collections,Dev Movie Collections,Lovers Day Movie Collections,,Yatra Telugu Movie Collections,Dev Telu
బాక్సాఫీస్

లేటెస్ట్ మూవీ కలెక్షన్స్

నిన్న వాలెంటైన్స్ డే సందర్భంగా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరి ఆ సినిమాల లేటెస్ట్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

TFN Adminవాట్సాప్
Niharika Konidela To Work With Sukumar,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Actress Niharika Konidela Latest News,Niharika Konidela Upcoming Movie News,Niharika Konidela New Movie Details,Niharika
సినిమా వార్తలు

నిహారికతో సుకుమార్ సినిమా

రంగస్థలం సినిమా తరువాత సుకుమార్ ఇప్పటివరకూ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను ఫైనల్ చేయలేదు. అయితే మహేష్ బాబుతో తన తరువాత చిత్రం ఉంటుందని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నా...అవి వార్తలుగా ఉన్నాయి తప్పా..ఇప్పటికీ క్లారిటీ లేదు. అయితే తాజాగా మహేశ్ ‌తో సినిమా విషయంలో సుక్కు సైడ్ అయిపోయి అనిల్ రావిపూడికి దారిచ్చారంటూ మరికొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎవరితో సినిమా ఉంటుందనేది తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

TFN Adminవాట్సాప్
Latest Telugu Movies News, Petta Movie Queens are Back, Simran and Trisha team up for heavy-duty action, Simran And Trisha To Act In An Action Entertainer, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Trisha and Simran team up f
సినిమా వార్తలు

అక్కాచెల్లెళ్ళుగా సిమ్రాన్‌, త్రిష‌

తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న త్రిష‌... `జోడీ` (1999) చిత్రంతో న‌టిగా తొలి అడుగులు వేసింది. ఆ సినిమాలో ఒక‌ప్ప‌టి గ్లామ‌ర్ క్వీన్ సిమ్రాన్‌కి స్నేహితురాలి పాత్ర‌లో కొన్ని స‌న్నివేశాల్లో సంద‌డి చేసింది ఈ చెన్నై బ్యూటీ. ఆ త‌రువాత ఈ ఇద్ద‌రూ... ఇర‌వై ఏళ్ళ గ్యాప్ త‌రువాత `పేట‌` (2019) సినిమాలో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌కి జోడీగా న‌టించినా... కాంబినేష‌న్ సీన్స్ అయితే లేవు.

Team TFNవాట్సాప్
Bellamkonda Sreenivas And Rakul Preet Singh Upcoming Movie News, Bellamkonda Sreenivas And Rakul Preet Team Up Again For A Film, Bellamkonda Sreenivas To Act With Rakul Preet Again?, Latest Telugu Movies News, Rakul Preet Singh to do Bellamkonda Sree
సినిమా వార్తలు

మ‌రోసారి జోడీ క‌ట్ట‌నున్న బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌, ర‌కుల్ ప్రీత్‌?

`జ‌య జాన‌కి నాయ‌క‌` చిత్రంలో జంట‌గా న‌టించి అల‌రించారు యువ కథానాయ‌కుడు బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌, అందాల తార ర‌కుల్ ప్రీత్ సింగ్‌. మ‌ళ్ళీ ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రం త‌రువాత ఈ ఇద్ద‌రూ మ‌రో సినిమాలో క‌ల‌సి న‌టించ‌బోతున్నార‌ని టాలీవుడ్ టాక్‌. ఆ వివ‌రాల్లోకి వెళితే... త‌మిళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన `రాచ్చ‌స‌న్‌` సినిమాని తెలుగులో రీమేక్ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో క‌థానాయ‌కుడిగా బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ న‌టించ‌నుండ‌గా... క‌థానాయిక పాత్ర‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ పేరుని ప‌రిశీలిస్తున్నార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ర‌కుల్ ఎంట్రీపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

Team TFNవాట్సాప్
Double Dhamaka For Actress Nayanthara Fans, Latest Telugu Movies News, Nayanthara Latest News, Nayanthara New Movie Details, Nayanthara Next Film Updates, Nayanthara Upcoming Movie News, Nayanthara Upcoming Movies in 2019, Telugu Film News 2019, Telu
సినిమా వార్తలు

వారం గ్యాప్‌లో న‌య‌న‌తార డ‌బుల్ ధ‌మాకా

కోలీవుడ్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా రాణిస్తోంది కేర‌ళ‌కుట్టి న‌య‌న‌తార‌. ఓ వైపు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూనే... మ‌రో వైపు స్టార్ హీరోల‌తో జోడీ క‌ట్టి మెప్పిస్తోంది. కేవ‌లం త‌మిళ చిత్రాల‌కే ప‌రిమితం కాకుండా... తెలుగు, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ న‌టిస్తూ చేతినిండా సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవికి జోడీగా `సైరా న‌ర‌సింహా రెడ్డి`లో న‌టిస్తున్న న‌య‌న్‌... త‌మిళ్‌లో `ఐరా`, `మిస్ట‌ర్ లోక‌ల్‌`, `కొలైయుదిర్ కాల‌మ్‌`, విజ‌య్ - అట్లీ కాంబినేష‌న్ మూవీలోనూ... మ‌ల‌యాళంలో `ల‌వ్ యాక్ష‌న్ డ్రామా`లోనూ న‌టిస్తోంది.

Team TFNవాట్సాప్
Actress Kajal Aggarwal Latest News, Heroine Kajal Aggarwal Upcoming Movie News, kajal Aggarwal New Movie Details, Kajal Aggarwal Next Film Updates, Latest Telugu Movies News, Special Day For Kajal Aggarwal, Telugu Film News 2019, Telugu Filmnagar, To
సినిమా వార్తలు

కాజ‌ల్... స్పెష‌ల్ డే

కాజ‌ల్ అగ‌ర్వాల్‌... ఈ భామ టాలీవుడ్‌కి చంద‌మామ‌. కేవ‌లం తెలుగులోనే కాదు త‌మిళ‌, హిందీ భాష‌ల్లోనూ న‌టిగా త‌న‌దైన ముద్ర వేసింది ఈ పంచ‌దార బొమ్మ‌. 50కి పైగా సినిమాల్లో న‌టించి... కుర్ర‌కారు మ‌దిని దోచేసింది. అలాంటి కాజ‌ల్‌కి ఈ రోజు ఎంతో ప్ర‌త్యేకం. ఎందుకంటే... స‌రిగ్గా ఇదే ఫిబ్ర‌వ‌రి 15న కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టించిన మొద‌టి సినిమా `ల‌క్ష్మీ క‌ళ్యాణం` (2007) విడుద‌లైంది. తేజ ద‌ర్శ‌క‌త్వంలో క‌ళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన ఈ సినిమాతోనే కాజ‌ల్ హీరోయిన్‌గా తొలి అడుగులు వేసింది. ప‌ల్లెటూరి అమ్మాయి ల‌క్ష్మిగా న‌టించి... తెలుగు ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించింది. ఆ త‌రువాత అదే ఏడాదిలో వ‌చ్చిన కృష్ణ‌వంశీ…

Team TFNవాట్సాప్
Balakrishna Boyapati Srinu Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Balakrishna And Boyapati Srinu Movie Latest News,Balakrishna Upcoming Movie News,Hero Balakrishna Next Film Detai
సినిమా వార్తలు

రెండు త‌రాల పాత్ర‌ల్లో నంద‌మూరి బాల‌కృష్ణ‌?

నట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌, యాక్ష‌న్ చిత్రాల స్పెష‌లిస్ట్ బోయ‌పాటి శ్రీ‌ను... ఈ పేర్లు విన‌గానే ఠ‌క్కున `సింహా`, `లెజెండ్‌` చిత్రాలే గుర్తుకువ‌స్తాయి. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. త్వ‌ర‌లో ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడో సినిమా రాబోతోంది. అంతేకాదు... `సింహా`, `లెజెండ్‌` త‌ర‌హాలోనే ఇందులోనూ బాల‌య్య రెండు విభిన్న పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం. అలాగే... రెండు త‌రాల పాత్ర‌ల్లో ఈ నంద‌మూరి హీరో క‌నిపించ‌నున్నాడ‌ట‌.

Team TFNవాట్సాప్
Nani’s Jersey Movie First Single Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Jersey Movie Updates,Jersey Telugu Movie Latest News,Jersey Movie Songs,Jersey Telugu Movie Songs
సాంగ్

జెర్సీ మూవీ - అదేంటోగానీ ఉన్న పాటుగా సాంగ్ రిలీజ్

మళ్లీరావా ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో నాని ఓ వైవిధ్యమైన కథ జెర్సీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రంజీ క్రికెటర్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 19వ రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు చిత్రయూనిట్. ఇక ఇటీవలే టీజర్ ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను విడుదల చేసింది. అదేంటోగానీ ఉన్నపాటుగా అన్న సాంగ్ ను విడుదల చేసింది చిత్ర బృందం.

TFN Adminవాట్సాప్
kangana Ranaut Talks About her Biopic,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Actress kangana Ranaut Latest News,Heroine kangana Ranaut Talks About her Biopic,Kangana Ranaut to direct her own biopic a
సినిమా వార్తలు

తన బయోపిక్ పై కంగనా ఇంట్రెస్టింగ్ కామెంట్

కంగనా అంటే కాంట్రవర్సీ.. కాంట్రవర్సీ అంటే కంగనా అని మణికర్ణిక సినిమాతో మరోసారి నిరూపించింది బాలీవుడ్ క్వీన్ కంగన. సినిమాలతో పాటు పలు కాంట్రవర్సీలతో ఎప్పుడూ వార్తల్లోనే నిలుస్తుంది ఈ భామ. కానీ ఎన్ని వివాదాలు వచ్చినా.. తన టాలెంట్, ముక్కుసూటి తనంతో ఇంత స్థాయిని సంపాదించుకుందన్న సంగతి కూడా అందరూ ఒప్పుకోవాల్సిన నిజమే. ఇక తాజాగా మణికర్ణిక సినిమాతో మరోసారి తన సత్తా చూపించింది. వివాదాల సంగతి పక్కన పెడితే ఈ సినిమాలో తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి కంగనాకు.

TFN Adminవాట్సాప్
TSR Award Winners 2017-2018,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,TSR National Film Awards Winners 2017-2018,TSR National Film Awards 2017 and 2018
సినిమా వార్తలు

2017-2018 టీఎస్ఆర్ నేషనల్ ఫిలిం అవార్డ్స్

ప్రముఖ వ్యాపారవేత్త,టి. సుబ్బరామరెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఫిలిం అవార్డులు అందజేస్తున్న సంగతి తెలిసిందే. ‘‘ఉత్తరాది, దక్షణాది అనే తేడా లేకుండా సినీ ప్రముఖుల్ని ఇంత ఘనంగా సత్కరించడం సుబ్బిరామిరెడ్డిగారికే చెల్లుతుంది. ఈక్రమంలో 2017, 2018 సంవత్సరాల్లో విడుదలైన చిత్రాల నుంచి ప్రతిభను చాటిన వాటికి పురస్కారాలను అందజేయనున్నారు టీఎస్ఆర్. కాగా ఈ సారి టీఎస్‌ఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకను ఫిబ్రవరి 17న వైజాగ్‌లో నిర్వహించబోతున్నారు. మరి 2017 - 2018 సంవత్సరాల్లో అవార్డులు ఎవరికి దక్కాయో..ఆ లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం..

TFN Adminవాట్సాప్
ఆకట్టుకుంటున్న మాయ మూవీ
ట్రైలర్ & టీజర్

ఆకట్టుకుంటున్న మాయ మూవీ

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఇంట్రెస్టింగానే చూస్తారు. కంటెంట్ కాస్త సాలిడ్ గా ఉంటే చాలు.. దర్శక నిర్మాతలకు పండగే. సినిమాను హిట్ చేసి పడేస్తారు ప్రేక్షకులు. అలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ తోనే ఇప్పుడు మరో సినిమా తెరకెక్కుతుంది. అదే మాయ సినిమా.

TFN Adminవాట్సాప్
Did February Sentiment Work For Yatra?,Telugu Filmnagar,TeluguFilm Updates,Latest Telugu Movie News 2019,Tollywood Cinema Updates,Yatra Movie Latest Updates,Will February Sentiment Work For Yatra Movie,Yatra Telugu Movie Updates
సినిమా వార్తలు

యాత్ర కు ఫిబ్రవరి సెంటిమెంట్ కలిసొచ్చిందా!

సినీ పరిశ్రమలో సెంటిమెంట్స్ కామన్ అయిపోయాయి. పలానా డైరెక్టర్, హీరో కలిసి సినిమా చేస్తే హిట్టని.. పలనా రోజు సినిమా రిలీజ్ చేస్తే హిట్టవుతుందని... ఇలా చాలా సెంటిమెంట్లనే ఫాలో అవుతారు మన సినీ ప్రముఖులు. అందులో ఎంత నిజముందో.. యాదృశ్చికంగా జరుగుతాయో తెలియదు కానీ... మన వాళ్లు మాత్రం ఆ సెంటిమెంట్స్ ను పాటిస్తుంటారు. ఇప్పుడు తాజాగా యాత్ర సినిమాకు కూడా ఈ సెంటిమెంట్ కలిసొచ్చిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటనుకుంటున్నారా? ఫిబ్రవరి సెంటిమెంట్. గతంలో ఫిబ్రవరి నెలలో విడుదలైన సినిమాలు మంచి ఘన విజయం సాధించాయి. దీంతో ఫిబ్రవరి సెంటిమెంట్ యాత్ర కూడా కలిసొచ్చిందన్న వార్తలు…

TFN Adminవాట్సాప్
Ram Charan Proves That He Is A Gentleman Again,Telugu Filmnagar,TeluguFilm Updates,Latest Telugu Movie News,Tollywood Cinema Updates,Ram Charan Latest Movies News,Mega Power Star Ram Charan Proves that he is Gentleman,Ram Charan New Movie News,Ram Ch
సినిమా వార్తలు

మరోసారి జెంటిల్ మ్యాన్ అయిన చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి జెంటిల్ మ్యాన్ అనిపించుకున్నాడు. బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా మెగా అభిమానులను నిరాశపరిచింది. దీంతో సినిమా ఫెయిల్యూర్ పై చరణ్ స్పందిస్తూ అభిమానులకు సారీ చెబుతూ ఓ లేఖ కూడా రాశారు. ఎంతో కష్టపడి సినిమా తీశామని.. కానీ ప్రేక్షకుల అంచనాలను రీచ్ ఈ సినిమా కాలేకపోయింది. మాకు సపోర్ట్ గా నిలిచినందుకు థ్యాంక్స్... ముందు ముందు మంచి సినిమాలతో వస్తామని తెలిపారు. దీంతో చరణ్ పై ప్రశంసలు కురిపించారు అందరూ.

TFN Adminవాట్సాప్
Karthi and Rakul Preet Dev Movie Runtime Locked,TeluguFilm Updates,Latest Telugu Movie News,Tollywood Cinema Updates,Dev Movie Runtime Fixed,Dev Movie Runtime Confirmed,Karthi and Rakul Preet Dev Movie Latest Updates,Dev Movie Runtime Revealed,Karthi
సినిమా వార్తలు

`దేవ్‌` ర‌న్ టైమ్ అప్‌డేట్‌

`ఖాకి` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత త‌మిళ క‌థానాయ‌కుడు కార్తి, అందాల తార ర‌కుల్ ప్రీత్ సింగ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా `దేవ్‌`. నూత‌న ద‌ర్శ‌కుడు ర‌జ‌త్ ర‌విశంక‌ర్ రూపొందించిన ఈ చిత్రంలో ప్ర‌కాష్ రాజ్‌, ర‌మ్య‌కృష్ణ ఇత‌ర ముఖ్య పాత్ర‌లు పోషించారు. యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ రొమాంటిక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకి హారిస్ జైరాజ్ సంగీత‌మందించాడు. గ‌తంలో సూర్య న‌టించిన ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు హారిస్ స్వ‌రాలందించ‌గా... కార్తి కాంబినేష‌న్‌లో హారిస్ బాణీలందించిన తొలి చిత్ర‌మిదే కావ‌డం విశేషం. కాగా... అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా వాలెంటైన్స్ డే స్పెష‌ల్‌గా ఈ నెల 14న…

Team TFNవాట్సాప్
Actress Sai Pallavi Beats Her Own Record, Heroine Sai Pallavi New Movie News, Latest Telugu Movie News, Sai Pallavi Beats Her Own Record, Sai Pallavi New Movies Updates, Sai Pallavi Next Project Details, Sai Pallavi Upcoming Film News, Telugu Filmnag
సినిమా వార్తలు

సాయిప‌ల్ల‌విని బీట్ చేసిన సాయిప‌ల్ల‌వి

ఈ త‌రం క‌థానాయిక‌ల్లో సాయిప‌ల్ల‌వి కున్న క్రేజే వేరు. న‌ట‌న‌, న‌ర్త‌న‌... ఈ రెండు విష‌యాల్లోనూ త‌న‌కు తిరుగులేద‌నిపించుకుంది ఈ అమ్మ‌డు. అంతేకాదు... ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా త‌న‌కంటూ ఓ అభిమానగ‌ణాన్ని సంపాదించుకుందీ టాలెంటెడ్ బ్యూటీ. ముఖ్యంగా... సాయిప‌ల్ల‌వి డ్యాన్సుల‌కు `ఫిదా` కాని కుర్ర‌కారు ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. అందుకే... యూ ట్యూబ్‌లో సాయిప‌ల్ల‌వి న‌ర్తించిన పాట‌ల‌ను ప‌దే ప‌దే వీక్షిస్తూ... ఆమె పాపుల‌ర్ సాంగ్స్ ను కాస్త మోస్ట్ వ్యూయిడ్ సాంగ్స్ గా అంద‌ల‌మెక్కిస్తున్నారు యూట్యూబ్ వ్యూయ‌ర్స్‌. తాజాగా... ఈ ముద్దుగుమ్మ త‌న పాట రికార్డును త‌నే బ‌ద్ధ‌లు కొట్టింది.

Team TFNవాట్సాప్
Good News For Superstar Mahesh Babu Fans,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Mahesh Babu Wax Figure From Tussaud To Be Flown To Hyderabad,Superstar Mahesh Babu Latest News,Mahesh Babu Wax Statue t
సినిమా వార్తలు

మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్

దేశ విదేశాలలో మేడమ్ టుస్సాడ్స్ మైనపు ప్రతిమల మ్యూజియం లు కొలువుతీరిన విషయం తెలిసిందే. సినిమా నటులతో పాటు ప్రపంచ ప్రముఖుల మైనపు ప్రతిమలు ఈ మ్యూజియం లలో ఉంటాయి. సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి ఆ గౌరవంపొందిన అతి తక్కువ మందిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. మహేష్ బాబు మైనపు ప్రతిమ సింగపూర్ లో తయారయింది. ఆ ప్రతిమ ఫిబ్రవరి నెలాఖరు లో హైదరాబాద్ కు రానుందని సమాచారం.

Team TFNవాట్సాప్
Kalki Movie Rajasekhar Birthday Teaser Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movie News 2019,Tollywood Cinema Updates,Kalki Movie Teaser,Kalki Telugu Movie Teaser,Rajasekhar New Movie Kalki Teaser,#KalkiTeaser,Kalki Teaser,Rajase
ట్రైలర్ & టీజర్

రాజశేఖర్ బర్త్ డే - కల్కీ టీజర్ రిలీజ్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా కల్కీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ రోజు రాజశేఖర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఫస్ట్ టీజర్ ను రిలీజ్ చేశారు. కేవలం ఒక్క యాక్షన్ సీన్ మాత్రమే టీజర్లో కట్ చేశారు. వర్షంలో రాజశేఖర్ పై ఒక గ్యాంగ్ చేసే దాడిని ఈ టీజర్లో చూపించారు.

TFN Adminవాట్సాప్

షేర్