నటసింహ నందమూరి బాలకృష్ణ, యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను… ఈ పేర్లు వినగానే ఠక్కున `సింహా`, `లెజెండ్` చిత్రాలే గుర్తుకువస్తాయి. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. త్వరలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమా రాబోతోంది. అంతేకాదు… `సింహా`, `లెజెండ్` తరహాలోనే ఇందులోనూ బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడని సమాచారం. అలాగే… రెండు తరాల పాత్రల్లో ఈ నందమూరి హీరో కనిపించనున్నాడట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక పాత్రేమో… 30 ఏళ్ళ క్రితం నాటిది అయితే… మరొకటి ప్రస్తుత కాలంలో సాగే పాత్ర అని సమాచారం. అంతేకాదు… కాస్త పొలిటికల్ టచ్ కూడా ఈ సినిమాలో ఉంటుందని టాక్. పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎమోషన్స్ కూడా ఎంతో ప్రాధాన్యముంటుందట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా… ఈ నెల మూడో వారంలో పూజా కార్యక్రమాలు జరుపుకుంటుందని తెలుస్తోంది. కాగా… 2020 సంక్రాంతి కానుకగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరపైకి రానుంది.
[youtube_video videoid=HOcp8T7TM1g]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: