కంగనా అంటే కాంట్రవర్సీ.. కాంట్రవర్సీ అంటే కంగనా అని మణికర్ణిక సినిమాతో మరోసారి నిరూపించింది బాలీవుడ్ క్వీన్ కంగన. సినిమాలతో పాటు పలు కాంట్రవర్సీలతో ఎప్పుడూ వార్తల్లోనే నిలుస్తుంది ఈ భామ. కానీ ఎన్ని వివాదాలు వచ్చినా.. తన టాలెంట్, ముక్కుసూటి తనంతో ఇంత స్థాయిని సంపాదించుకుందన్న సంగతి కూడా అందరూ ఒప్పుకోవాల్సిన నిజమే. ఇక తాజాగా మణికర్ణిక సినిమాతో మరోసారి తన సత్తా చూపించింది. వివాదాల సంగతి పక్కన పెడితే ఈ సినిమాలో తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి కంగనాకు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఝాన్నీ లక్ష్మీ భాయ్ జీవిత ఆధారంగా తెరకెక్కిన సినిమాలో నటించిన కంగనా.. ఇప్పుడు తన బయోపిక్ ను కూడా తెరకెక్కిస్తానంటుంది. అసలు సంగతేంటంటే.. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న కంగనా..తన బయోపిక్ కు తానే దర్శకత్వం వహిస్తానని చెప్పి షాకిచ్చింది. తన జీవితం ఎలా ఉండేదో.. ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా తెరకెక్కిస్తానని చెప్పింది. కొన్ని వారల క్రితం ప్రముఖ రచయిత విజేయంద్రప్రసాద్ కంగనా జీవితంపై పుస్తకం రాస్తానని చెప్పారట. ఆ కారణంగానే ఒప్పుకున్నట్లు.. తన బయోపిక్ కి విజయేంద్రప్రసాదే కథ అందిస్తారని చెప్పుకొచ్చింది. ”నన్ను జడ్జ్ చేయకుండా నన్ను నాలా స్వీకరించి ప్రేమించేవారు నా చుట్టూ ఎందఱో ఉన్నారు. వారి కోసమైనా సినిమా తీయాలని అనుకుంటున్నానని”.. హిమాలయాల నుంచి వచ్చిన ఓ అమ్మాయి.. బాలీవుడ్‌లో ఎలా ఓ ప్రముఖ హీరోయిన్‌గా ఎదిగింది.. తన జీవితంలో సహాయం చేసిన వారి దగ్గరనుండి అవమానించిన వారి వరకు అందరి గురించి బయోపిక్ లో ప్రస్తావించబోతున్నట్లు వెల్లడించింది. మరి చూద్దాం ఆ బయోపిక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో? ఎలా ఉంటుందో..? దానిపై ఎంత రచ్చ జరుగుతుందో..?
[youtube_video videoid=LlHI_pFQSOA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: