కాజ‌ల్… స్పెష‌ల్ డే

Actress Kajal Aggarwal Latest News, Heroine Kajal Aggarwal Upcoming Movie News, kajal Aggarwal New Movie Details, Kajal Aggarwal Next Film Updates, Latest Telugu Movies News, Special Day For Kajal Aggarwal, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Special Day For Kajal Aggarwal

కాజ‌ల్ అగ‌ర్వాల్‌… ఈ భామ టాలీవుడ్‌కి చంద‌మామ‌. కేవ‌లం తెలుగులోనే కాదు త‌మిళ‌, హిందీ భాష‌ల్లోనూ న‌టిగా త‌న‌దైన ముద్ర వేసింది ఈ పంచ‌దార బొమ్మ‌. 50కి పైగా సినిమాల్లో న‌టించి… కుర్ర‌కారు మ‌దిని దోచేసింది. అలాంటి కాజ‌ల్‌కి ఈ రోజు ఎంతో ప్ర‌త్యేకం. ఎందుకంటే… స‌రిగ్గా ఇదే ఫిబ్ర‌వ‌రి 15న కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టించిన మొద‌టి సినిమా `ల‌క్ష్మీ క‌ళ్యాణం` (2007) విడుద‌లైంది. తేజ ద‌ర్శ‌క‌త్వంలో క‌ళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన ఈ సినిమాతోనే కాజ‌ల్ హీరోయిన్‌గా తొలి అడుగులు వేసింది. ప‌ల్లెటూరి అమ్మాయి ల‌క్ష్మిగా న‌టించి… తెలుగు ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించింది. ఆ త‌రువాత అదే ఏడాదిలో వ‌చ్చిన కృష్ణ‌వంశీ `చంద‌మామ‌`తో యువ‌తరాన్ని ఫిదా చేసింది. ఆ సినిమా టైటిల్ నే త‌న పేరుకి ముందు జ‌త‌చేసుకునేంత‌గా ఆ పాత్ర‌లో ఒదిగిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన `మ‌గ‌ధీర‌`(2009)తో స్టార్ డ‌మ్ ని పొందిన కాజ‌ల్‌… ఆ త‌రువాత వెనుతిరిగి చూడాల్సిన అవ‌స‌రం రాలేదు. మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, యంగ్ టైగ‌ర్‌ య‌న్టీఆర్‌, యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, మెగాప‌వ‌ర్ స్టార్‌ రామ్ చ‌ర‌ణ్‌, స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌, మాస్ మ‌హ‌రాజ్‌ ర‌వితేజ వంటి టాలీవుడ్ టాప్ హీరోల‌తోనూ… విజ‌య్‌, అజిత్‌, సూర్య వంటి కోలీవుడ్ స్టార్ హీరోల‌తోనూ… అక్ష‌య్ కుమార్‌, అజ‌య్ దేవ్‌గ‌ణ్ వంటి బాలీవుడ్ స్టార్స్‌తోనూ క‌ల‌సి న‌టించిన ఈ స్ట‌న్నింగ్ బ్యూటీ… ప్ర‌స్తుతం `భార‌తీయుడు` సీక్వెల్‌లో లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్‌తో జట్టు క‌ట్టింది. మ‌రో వైపు… `పారిస్ పారిస్‌` (త‌మిళ్‌), `సీత‌` వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది.

నేటితో క‌థానాయిక‌గా పుష్క‌ర‌కాలం పూర్తిచేసుకుంటున్న కాజ‌ల్ అగ‌ర్వాల్‌… మున్ముందు మ‌రిన్ని వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌లు పోషించి… శ‌త చిత్రాల నాయిక అనిపించుకోవాల‌ని ఆశిద్దాం!

[subscribe]

[youtube_video videoid=tVbRdk4bX2E]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =