మళ్లీరావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని ఓ వైవిధ్యమైన కథ జెర్సీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రంజీ క్రికెటర్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 19వ రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు చిత్రయూనిట్. ఇక ఇటీవలే టీజర్ ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను విడుదల చేసింది. అదేంటోగానీ ఉన్నపాటుగా అన్న సాంగ్ ను విడుదల చేసింది చిత్ర బృందం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో నాని సరసన కన్నడ నటి శ్రద్ధ శ్రీనాధ్ హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. మరి క్రికెట్ నేపథ్యంలో వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి చూద్దాం నానికి ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ తెచ్చిపెడుతుందో..
[youtube_video videoid=Rl6T0bM94Qs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: