తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న త్రిష… `జోడీ` (1999) చిత్రంతో నటిగా తొలి అడుగులు వేసింది. ఆ సినిమాలో ఒకప్పటి గ్లామర్ క్వీన్ సిమ్రాన్‌కి స్నేహితురాలి పాత్రలో కొన్ని సన్నివేశాల్లో సందడి చేసింది ఈ చెన్నై బ్యూటీ. ఆ తరువాత ఈ ఇద్దరూ… ఇరవై ఏళ్ళ గ్యాప్ తరువాత `పేట` (2019) సినిమాలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి జోడీగా నటించినా… కాంబినేషన్ సీన్స్ అయితే లేవు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో… ఓ లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ కోసం ఈ ఇద్దరూ కలసి నటించబోతున్నారని కోలీవుడ్ టాక్. అంతేకాదు… ఈ సినిమాలో అక్కాచెల్లెళ్ళుగా కనిపించబోతున్నారని సమాచారం. అడ్వంచరస్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో నీటి లోపల చేసే యాక్షన్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలుస్తాయని… ఇందుకోసం సిమ్రాన్, త్రిష ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారని తెలుస్తోంది. మార్చి మొదటి వారంలో పట్టాలెక్కనున్న ఈ సినిమా… కొడైకెనాల్, కేరళ, పిచ్చావరమ్ దేశీ లొకేషన్లతో పాటు థాయ్‌ల్యాండ్‌లోనూ చిత్రీకరణ జరుపుకోనుంది. సుమంత్ రాధాకృష్ణన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ఈ ఏడాది చివరలో తెరపైకి వచ్చే అవకాశముంది.
[youtube_video videoid=JPm_X8_5GAI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: