
ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 79


విజయ్ దేవరకొండతో హుషారు డైరెక్టర్ మూవీ!

టైటిల్ మారిన నిఖిల్ ముద్ర మూవీ

మహేష్, బన్నీ, నాని... సేమ్ టు సేమ్

మల్లేశం మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

సైంటిస్ట్ వర్షగా నిత్యా మీనన్

`వాల్మీకి`లో తెలుగమ్మాయి?

బాలకృష్ణకి జోడీగా నాని హీరోయిన్?

నలుగురు భామలతో విజయ్ దేవరకొండ?

యంగ్ హీరోకి ఛాన్స్ ఇస్తున్న సుకుమార్

హీరో నిఖిల్ సిద్ధార్ధ్ సందేశం

చీకటి గదిలో చితక్కొట్టుడు మూవీ ట్రైలర్ రిలీజ్

ఎఫ్2 20 డేస్ కలెక్షన్స్

తమిళ్, హిందీలో ఎఫ్2 రీమేక్!

దేవ్ తెలుగు ట్రైలర్ రిలీజ్

ఇస్మార్ట్ శంకర్ లో మరో హీరోయిన్ ఫిక్స్

వివాహ బంధంతో ఒక్కటవుతున్న స్టార్స్

మణికర్ణిక వివాదం పై మిల్కీ బ్యూటీ రియాక్షన్

కోన సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్
అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. హార్రర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ మార్చి నుండి అమెరికాలో ప్రారంభంకానుందని... 2019 ద్వితీయార్ధంలో చిత్రం విడుదల అవుతుందని కోన వెంకట్ ఇప్పటికే తెలిపారు.

విజయ్ దేవరకొండతో హుషారు డైరెక్టర్ మూవీ!
శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో.. బెక్కెం వేణుగోపాల్, రియాజ్ నిర్మించిన చిత్రం ‘హుషారు’. తేజస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ మంచు, దినేశ్ తేజ్, దక్షా నగార్కర్, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇటీవలే రిలీజై మంచి విజయం సాధించింది. పెద్ద సినిమాలే నాలుగైదు వారాలు మించి ఆడని తరుణంలో చిన్న సినిమా అయినా 50 రోజులు పూర్తి చేసుకొని పెద్ద సంచలనమే సృష్టించిందని చెప్పొచ్చు ‘హుషారు’. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం కేవలం మౌత్ పబ్లిసిటీతో జనాల్లోకి వెళ్లింది. మొదట తక్కువ థియేటర్లే దక్కినా.. తరువాత ఈ సినిమాకు వచ్చిన టాక్ వల్ల థియేటర్లు పెంచాల్సి వచ్చింది…

వేలానికి యాత్ర ఫస్ట్ షో టికెట్ - లక్షల్లో పలికిన టికెట్
మహి. వి రాఘవ్ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ స్టార్ ముమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా టీజర్ కు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

టైటిల్ మారిన నిఖిల్ ముద్ర మూవీ
హీరో నిఖిల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా TN సంతోష్ దర్శకత్వంలో జర్నలిజం బ్యాక్ డ్రాప్ లో నిజ సంఘటనలు, నిజాలు నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ నిఖిల్ ముద్ర మూవీ రూపొందుతుంది. కనితన్ తమిళ మూవీ తెలుగు రీమేక్ ఈ నిఖిల్ మూవీ. మూవీ డైనమిక్స్, ఆరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై రూపొందుతున్న ఈ మూవీ లో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్నారు. బి. మధు సమర్పణలో రాజ్ కుమార్ ఆకెళ్ళ, కావియ వేణు గోపాల్ నిర్మాతలు. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మహేష్, బన్నీ, నాని... సేమ్ టు సేమ్
తండ్రీకొడుకుల అనుబంధం, ఆ పాత్రల మధ్య సంఘర్షణ... ఇలాంటి నేపథ్యంతో తెలుగు తెరపై ఎన్నో సినిమాలు వచ్చాయి. వీటిలో సింహభాగం చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఇదిలా ఉంటే... ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఇదే శైలి కథాంశాలతో తెరకెక్కుతున్నాయని తెలుస్తోంది. ఆ చిత్రాలే `మహర్షి`, `జెర్సీ`, అల్లు అర్జున్ - త్రివిక్రమ్‌ల పేరు నిర్ణయించని చిత్రం.

మల్లేశం మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం చేనేత కార్మికుల వెతలు తీర్చడానికి నేత కు సంబంధించిన ఆసు యంత్రాన్ని 7సంవత్సరాలు కస్టపడి కనుగొన్నారు. మామూలుగా ఆసు పోయడం తో ఒక చీర నేయడానికి 5నుంచి 6గంటలు పడుతుంది. అదే ఆసు యంత్రంతో గంటన్నర లో ఒక చీర నేయవచ్చు. ఆ ఆసు యంత్రం కనుగొందుకు మల్లేశం పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.

80 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న `చిత్రలహరి`
`సుప్రీమ్` హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా `నేను శైలజ` ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `చిత్రలహరి`. కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. అక్టోబర్‌లో లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా ఇప్పటివరకు 80 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ముంబైలోని మెరీన్ డ్రైవ్‌లో జరుగుతోంది.

సైంటిస్ట్ వర్షగా నిత్యా మీనన్
దక్షిణాదిలోని అన్ని పరిశ్రమల్లోనూ నటిగా తన ప్రతిభను చాటుకుంది కేరళ కుట్టి నిత్యా మీనన్. అలాగే... పలు పురస్కారాలను తన సొంతం చేసుకుంది. త్వరలో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతోంది. అక్షయ్ కుమార్, విద్యా బాలన్, సోనాక్షి సిన్హా, కీర్తి కుల్హారితో కలసి నిత్య నటిస్తున్న ఆ చిత్రమే `మిషన్ మంగళ్`.

`వాల్మీకి`లో తెలుగమ్మాయి?
తమిళంలో ఘనవిజయం సాధించిన `జింగర్తండా` సినిమాని... తెలుగులో `వాల్మీకి` పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ రూపొందిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం... ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ చెన్పైలో జరుగుతున్నాయి.

బాలకృష్ణకి జోడీగా నాని హీరోయిన్?
నటసింహ నందమూరి బాలకృష్ణ, యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో... `సింహా`, `లెజెండ్` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... ఓ పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌తో తెరకెక్కనుందని టాలీవుడ్ టాక్. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో కథానాయికగా నటించే అవకాశం ఓ కన్నడ భామకు దక్కిందని సమాచారం. కన్నడ బ్లాక్‌బస్టర్ `యూ టర్న్`తో దక్షిణాదిన పాపులర్ అయిన శ్రద్ధా శ్రీనాథ్ కి ఈ భారీ బడ్జెట్ మూవీలో మెయిన్ హీరోయిన్‌గా నటించే ఛాన్స్ దక్కిందని సమాచారం.

నలుగురు భామలతో విజయ్ దేవరకొండ?
`పెళ్ళి చూపులు`, `అర్జున్ రెడ్డి`, `గీత గోవిందం` వంటి విజయవంతమైన చిత్రాలతో యువతరానికి చేరువైన కథానాయకుడు విజయ్ దేవరకొండ. అనతి కాలంలోనే యూత్ ఐకాన్ గా పేరు తెచ్చుకున్న ఈ హ్యాండ్సమ్ హీరో... ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఒకవైపు నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో `డియర్ కామ్రేడ్` చేస్తున్న విజయ్... మరోవైపు `మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు` ఫేమ్ క్రాంతి మాధవ్ డైరెక్షన్‌లోనూ ఓ సినిమా చేస్తున్నాడు.

యంగ్ హీరోకి ఛాన్స్ ఇస్తున్న సుకుమార్
స్టార్ డైరెక్టర్ సుకుమార్ అటు సినిమాలు తీస్తూనే మరోపక్క చిన్న సినిమాలను కూడా నిర్మిస్తున్నారు ఈ మధ్య. సుకుమార్ రైటింగ్స్‌ను స్థాపించి తన వద్ద పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్లను డైరెక్టర్లుగా మార్చేస్తున్నారు. తాజాగా ఈ సంస్థ నుంచి మరో ప్రాజెక్ట్ ఖరారైంది.

హీరో నిఖిల్ సిద్ధార్ధ్ సందేశం
మూవీ డైనమిక్స్ LLP , ఆరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై TN సంతోష్ దర్శకత్వంలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అర్జున్ లెనిన్ సురవరం గా హీరో నిఖిల్ నటించిన నిఖిల్ ముద్ర మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. సామ్ CS సంగీతం అందిస్తున్న నిఖిల్ ముద్ర మూవీ లో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తున్నారు. రాజ్ కుమార్ ఆకెళ్ళ, కావియ వేణుగోపాల్ నిర్మాతలు.

చీకటి గదిలో చితక్కొట్టుడు మూవీ ట్రైలర్ రిలీజ్
బ్లూ ఘోస్ట్ పిక్చర్స్ బ్యానర్ పై సంతోష్ P జయకుమార్ దర్శకత్వం లో ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు తమిళ్ మూవీ తెలుగు రీమేక్ చీకటి గదిలో చితక్కొట్టుడు మూవీ అడల్ట్ కామెడీ హారర్ మూవీ గా రూపొందింది. తమిళ్ మాతృక కు దర్శకత్వం వహించిన సంతోష్ P జయకుమార్ ఈ రీమేక్ మూవీ ద్వారా టాలీవుడ్ కు దర్శకుడి గా పరిచయ మవుతున్నారు. అదిత్ అరుణ్, నిక్కీ తంబోలి ప్రధాన పాత్రలలో నటించారు.

ఎఫ్2 20 డేస్ కలెక్షన్స్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్, తమన్నా, మెహ్రీన్ లు నటించిన సినిమా ఎఫ్2. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. సినిమా రిలీజ్ అయి నాలుగో వారం అవుతున్నా... కలెక్షన్లు మాత్రం తగ్గట్లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అంశాలు ఎక్కువగా ఉండడంతో.. విక్టరీ వెంకటేష్ కామెడీ ప్లస్ అవడంతో సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఈ 20 రోజుల్లో ఈ మూవీ రూ 74 కోట్ల షేర్ ను సాధించింది. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ వెంకీ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. మరి ఎక్కడెక్కడ ఎంత షేర్ రాబట్టిందో…

తమిళ్, హిందీలో ఎఫ్2 రీమేక్!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన మల్టీస్టారర్ ఎఫ్2 సినిమా ఎంత ఘన విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా సంక్రాంతి విజేతగా నిలిచి కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. వంద కోట్ల మైలు రాయిని అందుకుని దిల్‌రాజు చిత్రాల్లో నెంబర్ వన్‌గా నిలిచింది.

దేవ్ తెలుగు ట్రైలర్ రిలీజ్
రజత్ రవిశంకర్ దర్శకత్వంలో తమిళ హీరో కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్నసినిమా సినిమా దేవ్. తెలుగు, తమిళ్ లో తెరకెక్కుతున్న ఈసినిమా ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇక ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈసినిమా యూ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రాగా... తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కార్తి అన్న సూర్య ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఇస్మార్ట్ శంకర్ లో మరో హీరోయిన్ ఫిక్స్
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. ఇటీవలే లాంఛనంగా ప్రారంభించిన ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాలో నటించే ఒక హీరోయిన్ నిథి అగర్వాల్ ను ఎంపిక చేయగా..తాజాగా మరో హీరోయిన్ ను ప్రకటించారు. మరో హీరోయిన్ గా నభానటేష్ ను ఎంపిక చేసినట్టు ఛార్మీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.

వివాహ బంధంతో ఒక్కటవుతున్న స్టార్స్
గత ఏడాది సోనమ్ కపూర్, దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా ల పెళ్లిళ్లతో సందడిగా గడిపోయింది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో ఇద్దరు స్టార్స్ వివాహబంధంతో ఒకటి కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ స్టార్స్ ఎవరనుకుంటున్నారా? ఎవరో కాదు అఖిల్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సయేషా సైగల్, వరుడు , సైజ్ జీరో, ఒక రాజు ఒక రాణి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన హీరో ఆర్య. వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్టు సమాచారం. మార్చి 9, 10 తేదీలలో వీరి వివాహం జరగనుందని.. హైదరాబాద్‌లో ఆర్య, సయేషాల పెళ్లి వేడుక జరపనుండగా, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తారని టాక్.

మణికర్ణిక వివాదం పై మిల్కీ బ్యూటీ రియాక్షన్
సినిమా రిలీజ్ ముందే ఎన్నో వివాదాలు మూటగట్టుకున్న మణికర్ణిక... సినిమా రిలీజ్ అయిన తరువాత కూడా అవే వివాదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈసారి డైరెక్టర్ క్రిష్ వల్ల మరోసారి వివాదం తెరపైకి వచ్చిందని చెప్పొచ్చు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న క్రిష్ మణికర్ణిక గురించి మాట్లాడుతూ.. సినిమాలో 70 శాతం షూటింగ్ నేను చేసిందే ఉన్నది.. నేను బంగారం తీస్తే... కంగనా దాన్ని సిల్వర్ చేసిందంటూ ఇలా పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక క్రిష్ వ్యాఖ్యలపై కంగనా సోదరి స్పందించడం.. ఆతరువాత పులువురు ఈ వివాదం పై స్పందించి కొంతమంది కంగనాకుమద్దతు తెలుపుతుండగా...కొంతమంది క్రిష్ కు మద్దతు తెలుపుతుండటంతో రోజు రోజుకి వివాదం ముదురుతుంది.