కోలీవుడ్‌లో లేడీ సూపర్ స్టార్‌గా రాణిస్తోంది కేరళకుట్టి నయనతార. ఓ వైపు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూనే… మరో వైపు స్టార్ హీరోలతో జోడీ కట్టి మెప్పిస్తోంది. కేవలం తమిళ చిత్రాలకే పరిమితం కాకుండా… తెలుగు, మలయాళ భాషల్లోనూ నటిస్తూ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి జోడీగా `సైరా నరసింహా రెడ్డి`లో నటిస్తున్న నయన్… తమిళ్‌లో `ఐరా`, `మిస్టర్ లోకల్`, `కొలైయుదిర్ కాలమ్`, విజయ్ – అట్లీ కాంబినేషన్ మూవీలోనూ… మలయాళంలో `లవ్ యాక్షన్ డ్రామా`లోనూ నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… తమిళంలో నయన్ కథానాయికగా నటించిన రెండు చిత్రాలు… కేవలం వారం రోజుల గ్యాప్‌లో తెలుగులోనూ అనువాదాల రూపంలో విడుదల కానున్నాయి. గత ఏడాది తమిళనాట మంచి విజయం సాధించిన `ఇమైక్క నోడిగళ్` ఈ నెల 22న `అంజలి సి.బి.ఐ` పేరుతో విడుదల కానుండగా… ఈ సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించిన మరో తమిళ చిత్రం `విశ్వాసం` అదే పేరుతో మార్చి 1న రిలీజ్ కానుంది. మరి… వారం గ్యాప్‌లో డబుల్ ధమాకా ఇస్తున్న నయన్‌కి ఈ రెండు సినిమాలూ మంచి ఫలితాన్ని అందిస్తాయేమో చూడాలి.
[youtube_video videoid=n4WdtA4_Yb4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: