ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 71
డిఫరెంట్ రోల్‌లో సాయి తేజ్?
బన్నీ సినిమాలో సాయి తేజ్ హీరోయిన్?
గోపీచంద్ డైరెక్టర్‌తో వెంకటేష్ సినిమా?

సురేష్ ప్రొడక్షన్స్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ డిటైల్స్

ఈ నెల 12న ప్రారంభం కానున్న బాలకృష్ణ 105?

కోలీవుడ్‌కి వెళుతున్న కియారా అద్వాని?

హీరో నితిన్ తో జంటగా ప్రియా ప్రకాష్ వారియర్ ?

AA19 మూవీ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం

జూలై నుంచి సెట్స్ పైకి ‘రాజుగారి గది 3’?

టాలెంటెడ్ డైరెక్టర్‌తో వెంకీ సినిమా?

తేజ్-మారుతి సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్

నాన్ స్టాప్‌గా ‘గ్యాంగ్‌లీడర్’ షూటింగ్

‘మన్మథుడు 2’ టీమ్‌లో జాయిన్ అయిన కీర్తి సురేష్
రవితేజ ‘మహా సముద్రం’... తాజా అప్‌డేట్
గత ఏడాది సంచలనం ‘ఆర్ఎక్స్ 100’తో దర్శకుడిగా తొలి అడుగులు వేశాడు అజయ్ భూపతి. ప్రస్తుతం తన రెండో చిత్రానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడీ టాలెంటెడ్ డైరెక్టర్. మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కించనున్న ఈ చిత్రానికి ‘మహా సముద్రం’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసారు. బౌండ్ స్క్రిప్ట్‌తో రెడీగా ఉన్న అజయ్... త్వరలోనే సినిమాను సెట్స్ పైకి తీసుకుని వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడట. అయితే... ప్రస్తుతం ‘డిస్కో రాజా’తో రవితేజ బిజీగా ఉండడంతో ఆ సినిమా ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే... ఈ చిత్రాన్ని పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నట్టు భోగట్టా.
బాలయ్య, బోయపాటి, ‘దిల్’ రాజు కాంబోలో సినిమా?
‘భద్ర’ (2005) సినిమాతో టాలీవుడ్‌కి దర్శకుడిగా పరిచయమయ్యాడు యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను. అప్పట్లో... సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజుకు నిర్మాతగా హ్యాట్రిక్ విజయాన్ని అందించిందా చిత్రం. అంతటి భారీ విజయాన్ని అందుకున్న ఈ కాంబినేషన్... దాదాపు 14 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు మరో సినిమా చేయడానికి సిధ్ధపడుతున్నట్టు టాలీవుడ్ టాక్.
డిఫరెంట్ రోల్‌లో సాయి తేజ్?
ఈ వేసవికి విడుదలైన ‘చిత్రలహరి’తో మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేశాడు మెగా హీరో సాయి తేజ్. కొత్త తరహా కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తేజుకి... ఈ కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ బాగా వర్కవుట్ అయిందనే చెప్పాలి. ఈ విజయం అందించిన ఉత్సాహంతో తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు ఈ మెగా హీరో. ప్రస్తుతం తేజు... యూత్‌ఫుల్ మూవీస్ స్పెషలిస్ట్ మారుతి డైరెక్షన్‌లో ‘భోగి’ (ప్రచారంలో ఉన్న పేరు) అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు... ఇదివరకు ఎప్పుడూ కనిపించని పాత్రలో ఇందులో దర్శనమివ్వనున్నాడట ఈ `సుప్రీమ్` స్టార్.
బన్నీ సినిమాలో సాయి తేజ్ హీరోయిన్?
‘మెంటల్ మదిలో’తో టాలీవుడ్‌కు కథానాయికగా పరిచయమైంది నివేదా పేతురాజ్. ఇటీవల సాయి తేజ్ హీరోగా నటించిన ‘చిత్రలహరి’లోనూ `స్వేచ్ఛ` పాత్రలో ప్రేక్షకులను పలకరించిందీ భామ. ప్రస్తుతం నివేదా ఓ కీలక పాత్రలో నటించిన ‘బ్రోచేవారెవరురా’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే... తాజాగా ఈ టాలెంటెడ్ బ్యూటీని ఓ మెగా ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం.
గోపీచంద్ డైరెక్టర్‌తో వెంకటేష్ సినిమా?
‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శ్రీవాస్. హాస్యానికి పెద్ద పీట వేస్తూ రూపొందించిన ఈ రెండు సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఇప్పుడు అదే కోవలో మరో చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట శ్రీవాస్.

సురేష్ ప్రొడక్షన్స్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ డిటైల్స్
సురేష్ ప్రొడక్షన్స్… దేశం గర్వించదగ్గ చిత్ర నిర్మాణ సంస్థలలో ఒకటి. పరాజయాలలోనూ అవకాశాలుంటాయని నమ్మిన సంస్థ. అందుకే 55 ఏళ్ళుగా తమ సంస్థలో పలు చిత్రాలను నిర్మించి ఘన విజయాలను సొంతం చేసుకుంటోంది. మూవీ మొఘల్, స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు స్థాపించిన ఈ సంస్థను ఆయన తనయుడు డి.సురేష్ బాబు ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను నిర్మించనున్నట్టు అధినేత సురేష్ బాబు స్వయంగా వెల్లడించారు.

250 మంది జూనియర్ ఆర్టిస్టులతో ‘వెంకీమామ’ యాక్షన్ సీక్వెన్స్?
విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘వెంకీమామ’. కె.యస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీని డి.సురేష్ బాబు, టి.జి.విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రైస్ మిల్ ఓనర్‌గా వెంకీ, ఆర్మీ ఆఫీసర్‌గా చైతు దర్శనమివ్వనున్న ఈ సినిమా… ప్రస్తుతం కాశ్మీర్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది.

హైలైట్‌గా నిలవనున్న ‘ఆర్ ఆర్ ఆర్’ ఇంటర్వెల్ బ్యాంగ్
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ పిరియాడిక్ డ్రామాలో కొమరం భీమ్‌గా తారక్… అల్లూరి సీతారామరాజుగా చరణ్ దర్శనమివ్వనున్నారు.

ఈ నెల 12న ప్రారంభం కానున్న బాలకృష్ణ 105?
నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ‘రూలర్’ (ప్రచారంలో ఉన్న పేరు) అనే సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను కోలీవుడ్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ తెరకెక్కించనున్నాడు. బాలయ్య 105వ చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మించనున్నాడు.

కోలీవుడ్‌కి వెళుతున్న కియారా అద్వాని?
‘భరత్ అనే నేను’తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన ఉత్తరాది భామ కియారా అద్వాని. ఆ తరువాత వినయ విధేయ రామలోనూ కనువిందు చేసింది. ప్రస్తుతం కియారా పలు హిందీ చిత్రాలలో కథానాయికగా నటిస్తూ బిజీగా ఉంది. కాగా, సౌత్ ఇండియన్ ఫిలిమ్స్‌లో నటించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే కియారా… ఇప్పుడు కోలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుందని టాక్.

రిలీజయిన హల్ చల్ మూవీ లిరికల్ సాంగ్
శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు శ్రీపతి కర్రి దర్శకత్వం లో రుద్రాక్ష్ ఉత్కమ్, ధన్య బాలకృష్ణ జంటగా కామెడీ థ్రిల్లర్ మూవీ హల్ చల్ రూపొందింది. కృష్ణుడు, మధునందన్, జెమిని సురేష్, షణ్ముఖ్, జోగి నాయుడు, రవి ప్రకాష్ , ప్రీతి నిగమ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటించారు. భరత్ మధుసూదనన్ సంగీతం అందించారు. బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి మూవీ ఫేమ్ తోట రాజు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.

హీరో నితిన్ తో జంటగా ప్రియా ప్రకాష్ వారియర్ ?
ఒరు అదార్ లవ్ మూవీ తో ప్రియా ప్రకాష్ వారియర్ మల్లువుడ్ కు పరిచయమయ్యారు. ఆ మూవీ లోని ఒక సాంగ్ లో కనుసైగలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని ఓవర్ నైట్ సెలబ్రిటీ గా మారారు. గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేసిన సెలబ్రిటీ గా ప్రియా ప్రకాష్ ముందున్నారు. ప్రియా ప్రకాష్ చాలా మూవీ ఆఫర్స్ అందుకున్నారు. ఇప్పుడు హీరో నితిన్ తో ఒక మూవీ లో ప్రియా ప్రకాష్ జతకట్టనున్నారని సమాచారం.

AA19 మూవీ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, హారిక &హాసిని బ్యానర్స్ పై AA19 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. లక్కీ హీరోయిన్ పూజ హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. థమన్ SS సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నAA19 మూవీ సెకండ్ షెడ్యూల్ ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభమయింది. ఈ రోజు నుండి హీరోయిన్ పూజ హెగ్డే షూటింగ్ లో పాల్గొంటారు.

‘సరిలేరు నీకెవ్వరు’లో విజయశాంతి పాత్ర డిటైల్స్?
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి… దాదాపు పాతికేళ్ళ పాటు పలు వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించి తన అసమాన అభినయంతో ప్రేక్షకులను అలరించిన నిన్నటి తరం కథానాయిక. పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాలకు దూరమైన ఈ సీనియర్ నటీమణి… సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’తో రీ-ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ సినిమాలో విజయశాంతి పాత్ర తీరు తెన్నులపై కొన్ని ఆసక్తికరమైన వార్తలు టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

జూలై నుంచి సెట్స్ పైకి ‘రాజుగారి గది 3’?
రాజుగారి గది సిరీస్‌లో భాగంగా వచ్చిన ‘రాజుగారి గది’ (2015), ‘రాజుగారి గది 2’(2017) చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో… ఇప్పుడు ‘రాజుగారి గది 3’కి ప్లానింగ్ జరుగుతోందని టాలీవుడ్ టాక్.

టాలెంటెడ్ డైరెక్టర్‌తో వెంకీ సినిమా?
ఈ ఏడాది ఆరంభంలో ‘ఎఫ్ 2’ వంటి బ్లాక్ బస్టర్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో… మెగాప్రిన్స్ వరుణ్ తేజ్‌తో కలసి వెంకీ చేసిన అల్లరి ఆడియన్స్‌ను అలరించింది. ప్రస్తుతం తన మేనల్లుడు యువ సామ్రాట్ నాగ చైతన్యతో కలసి ‘వెంకీమామ’లో నటిస్తున్నాడు ఈ సీనియర్ హీరో. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రీకరణ దశలో ఉంది. ఓ వైపు ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే… వెంకీ ఇప్పుడు మరో మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.

‘ఇస్మార్ట్ శంకర్’ -‘ఇస్పెషల్’ దుస్తులు-'ఇస్పెషల్ ప్రమోషన్స్'
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఇస్మార్ట్ శంకర్.ఇక ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి సినిమా కోసం ఎంతోమంది సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి కారణం వీరిద్దరి క్రేజీ కాంబినేషన్. ఇటీవల విడుదలైన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. రామ్ ఫుల్ మాస్ లుక్ లో చూపించాడు పూరీ.

తేజ్-మారుతి సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్
వరుస పరాజయాల తరువాత చిత్రలహరి సినిమాతో కాస్త రిలాక్స్ అయ్యాడు సాయితేజ్. ఇక ఇదే జోష్ లో మరో సినిమా చేస్తున్నాడు తేజ్. మారుతి డైరెక్షన్ లో తేజ్ కొత్త సినిమా ఉండబోతున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ల పై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

నాన్ స్టాప్‌గా ‘గ్యాంగ్‌లీడర్’ షూటింగ్
నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘గ్యాంగ్‌లీడర్’. వేర్వేరు ఏజ్ గ్రూప్‌లకి చెందిన ఐదుగురు మహిళల గ్యాంగ్‌కు లీడర్‌గా వ్యవహరించే ఓ యువకుడి చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా రూపొందుతోంది. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో… ‘ఆర్ ఎక్స్ 100’ హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్న ఈ సినిమాని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

‘మన్మథుడు 2’ టీమ్‌లో జాయిన్ అయిన కీర్తి సురేష్
కింగ్ నాగార్జున, స్టన్నింగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మన్మథుడు 2’. ‘మన్మథుడు’కి కొనసాగింపుగా వస్తున్న ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్ అతిథి పాత్రలలో దర్శనమివ్వనున్నారు.