విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘వెంకీమామ’. కె.యస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీని డి.సురేష్ బాబు, టి.జి.విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రైస్ మిల్ ఓనర్‌గా వెంకీ, ఆర్మీ ఆఫీసర్‌గా చైతు దర్శనమివ్వనున్న ఈ సినిమా… ప్రస్తుతం కాశ్మీర్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గత రెండు వారాలుగా మిలటరీ నేపథ్యంలో సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం దాదాపు 250మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నట్టు సమాచారం. జూన్ 13న పూర్తి కానున్న ఈ షెడ్యూల్ తరువాత స్వల్ప విరామం తీసుకుని… హైదరాబాద్‌లో తదుపరి షెడ్యూల్‌ను నిరవధికంగా చిత్రీకరించేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోందట.
కాగా, తమన్ సంగీతం అందిస్తున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్… ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
[youtube_video videoid=bJAKvOx_UE4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: