నాన్ స్టాప్‌గా ‘గ్యాంగ్‌లీడర్’ షూటింగ్‌

Nani Gang Leader Shooting in Brisk Pace,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Natural Star Nani Gang Leader Movie Latest News,Nani Gang Leader Telugu Movie Latest News,Nani Gang Leader Movie Shooting Updates,Nani Gang Leader Shooting Latest News
Nani Gang Leader Shooting in Brisk Pace

నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం ‘గ్యాంగ్‌లీడర్’. వేర్వేరు ఏజ్ గ్రూప్‌ల‌కి చెందిన ఐదుగురు మహిళల గ్యాంగ్‌కు లీడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించే ఓ యువ‌కుడి చుట్టూ తిరిగే క‌థ‌తో ఈ సినిమా రూపొందుతోంది. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో… ‘ఆర్ ఎక్స్ 100’ హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. అనిరుధ్‌ రవిచందర్ సంగీత‌మందిస్తున్న ఈ సినిమాని హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ‌ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెరుపువేగంతో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం… ఇప్ప‌టికే సింహభాగం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. కాగా, ఈ నెల 8 నుంచి హైద‌రాబాద్‌లో తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించనున్నారని స‌మాచారం. అంతేకాదు… దాదాపు నెల రోజులపాటు నిరవధికంగా ఈ షెడ్యూల్ సాగుతుంద‌ని స‌మాచారం. జూలై 5వ తేదీకల్లా సినిమాని పూర్తి చేసి… ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది చిత్ర బృందం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =