దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ పిరియాడిక్ డ్రామాలో కొమరం భీమ్‌గా తారక్… అల్లూరి సీతారామరాజుగా చరణ్ దర్శనమివ్వనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం… హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ఓ భారీ సెట్‌లో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. దాదాపు 1500మంది దేశీ, విదేశీ జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్న ఈ మెగా యాక్షన్ ఎపిసోడ్‌ను తారక్, చరణ్ పై చిత్రీకరించనున్నారు. ఇప్పటికే తారక్ ఈ పోరాట సన్నివేశాల్లో పాల్గొంటుండగా… త్వరలో చరణ్ కూడా చేరనున్నాడని టాక్.
ఇదిలా ఉంటే… ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే ఈ భారీ యాక్షన్ సీన్స్ చిత్రానికే హైలైట్‌గా ఉంటాయట. అంతేకాదు… ఈ యాక్షన్ సీన్స్‌తో పాటు, హీరోల ఇంట్రడక్షన్ సీన్స్ కూడా ప్రేక్షకులను అలరిస్తాయని అంటున్నారు. ఈ సన్నివేశాల కోసం భారీగానే ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తోంది.
ఈ షెడ్యూల్ తర్వాత… నార్త్ ఇండియాలో తదుపరి షెడ్యూల్‌ను చిత్రీకరించనున్నారట. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్రణాళిక కూడా సిద్ధం చేసారని టాక్. అలాగే… మరికొన్ని సన్నివేశాలను విదేశాలలో షూట్ చేయనున్నారట. ఇప్పటికే నలభై శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం… ఈ ఏడాది చివరికల్లా షూట్ పూర్తి చేసుకోనుందని సమాచారం.
చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్‌గా నటించనుండగా… బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఫ్రీడమ్ ఫైటర్ రోల్‌లో కనిపించనున్నట్టు సమాచారం. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ ఎంటర్‌టైనర్… వచ్చే ఏడాది జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
[subscribe]
[youtube_video videoid=0XwacVaiMO0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: