జూలై నుంచి సెట్స్ పైకి ‘రాజుగారి గది 3’?

Latest Telugu Movies News, Raju Gari Gadhi 3 Movie Shooting Latest News, Raju Gari Gadhi 3 Movie Updates, Raju Gari Gadhi 3 Telugu Movie Latest News, Raju Gari Gadhi 3 Telugu Movie Shooting Latest Updates, Tamanna Raju Gari Gadhi 3 to Commence from July, Tamannaah Raju Gari Gadhi 3 to Commence from July, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Tamannaah Raju Gari Gadhi 3 to Commence from July

రాజుగారి గది సిరీస్‌లో భాగంగా వచ్చిన ‘రాజుగారి గది’ (2015), ‘రాజుగారి గది 2’(2017) చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో… ఇప్పుడు ‘రాజుగారి గది 3’కి ప్లానింగ్ జ‌రుగుతోంద‌ని టాలీవుడ్ టాక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… రాజుగారి గది సిరీస్‌తో ప్రేక్ష‌కుల మెప్పు పొందిన దర్శకుడు ఓంకార్… ఇప్పుడు ‘రాజాగారి గది 3’ను తెర‌కెక్కించ‌డానికి సిధ్ధ‌ప‌డుతున్నాడట. తొలిభాగంలో పూర్ణ కీలక పాత్ర పోషించ‌గా… మలి భాగంలో సమంత కీ రోల్ ప్లే చేసింది. ఇప్పుడు రాబోయే థర్డ్ పార్ట్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా ముఖ్య భూమిక పోషిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అంతేకాదు.. సినిమా మొత్తం ఆమె పాత్ర చుట్టూ తిరుగుతుంద‌ని స‌మాచారం.

అలాగే తొలి రెండు భాగాలలో నటించిన నటీనటులే… దాదాపు ఈ మూడో పార్టులోనూ కనిపించనున్నట్టు తెలిసింది. అయితే… ‘రాజుగారి గది 2’లో ముఖ్య పాత్ర పోషించిన నాగార్జున మాత్రం ఈ థర్డ్ పార్ట్‌లో కనిపిస్తారా? లేదా? అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే… ఈ చిత్రాన్ని జూలై నెల‌లో ప్రారంభించి, ఆపై మూడు నెల‌ల్లో శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ పూర్తి చేసి, ఏడాది చివ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చే ప్లాన్‌లో ఉన్నాడట దర్శకుడు ఓంకార్. త్వ‌ర‌లోనే ఈ హార‌ర్ కామెడీ మూవీకి సంబంధించిన‌ మరిన్ని అప్‌డేట్స్ వెల్లడి కానున్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.