గత ఏడాది సంచలనం ‘ఆర్ఎక్స్ 100’తో దర్శకుడిగా తొలి అడుగులు వేశాడు అజయ్ భూపతి. ప్రస్తుతం తన రెండో చిత్రానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడీ టాలెంటెడ్ డైరెక్టర్. మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కించనున్న ఈ చిత్రానికి ‘మహా సముద్రం’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసారు. బౌండ్ స్క్రిప్ట్‌తో రెడీగా ఉన్న అజయ్… త్వరలోనే సినిమాను సెట్స్ పైకి తీసుకుని వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడట. అయితే… ప్రస్తుతం ‘డిస్కో రాజా’తో రవితేజ బిజీగా ఉండడంతో ఆ సినిమా ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే… ఈ చిత్రాన్ని పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నట్టు భోగట్టా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంతేకాదు, ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ చైతన్ భరద్వాజ్ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ప్రారంభించేసారట. ఇందులో భాగంగానే తాజాగా రెండు పాటలకు ట్యూన్స్‌ను కూడా కంపోజ్ చేసేసారని టాక్. కాగా, ఈ సినిమాలో ‘రోగ్’ ఫేమ్ ఇషాన్ విలన్‌గా కనిపించనున్నట్టు సమాచారం. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పి.కిరణ్ నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని విషయాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి.
[subscribe]
[youtube_video videoid=zrG2PzmMMR0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: