‘భద్ర’ (2005) సినిమాతో టాలీవుడ్‌కి దర్శకుడిగా పరిచయమయ్యాడు యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను. అప్పట్లో… సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజుకు నిర్మాతగా హ్యాట్రిక్ విజయాన్ని అందించిందా చిత్రం. అంతటి భారీ విజయాన్ని అందుకున్న ఈ కాంబినేషన్… దాదాపు 14 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు మరో సినిమా చేయడానికి సిధ్ధపడుతున్నట్టు టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడుగా బోయపాటి ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని రూపొందించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పక్కా స్క్రిప్ట్‌ను రెడీ చేసుకున్న బోయపాటి… తాజాగా ఆ స్క్రిప్ట్‌ని ‘దిల్’ రాజుకు వినిపించాడట. కథ నచ్చడంతో ‘దిల్’ రాజు కూడా నిర్మాతగా వ్యవహరించడానికి ఒప్పుకున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే… ‘దిల్’ రాజు నిర్మాణంలో బాలయ్య నటించనున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. ఇప్పటికే బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ రూపొందిన విషయం విదితమే. ఇప్పుడు హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి ఈ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ కూడా తోడైతే… ఆ అంచనాలు తారాస్థాయిలో ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
[subscribe]
[youtube_video videoid=rp663SlVisQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: