‘ఇస్మార్ట్‌ శంకర్‌’ -‘ఇస్పెషల్‌’ దుస్తులు-‘ఇస్పెషల్ ప్రమోషన్స్’

iSmart Shankar clothline on cards, iSmart Shankar ISPECIAL clothing line, iSmart Shankar Movie Updates, Ismart Shankar Promotions with ISpecial clothing, iSmart Shankar Telugu Movie Latest News, Latest Telugu Movies News, Ram Pothineni Ismart Shankar Movie Latest Updates, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Ismart Shankar Promotions with ISpecial clothing

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఇస్మార్ట్ శంకర్.ఇక ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి సినిమా కోసం ఎంతోమంది సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి కారణం వీరిద్దరి క్రేజీ కాంబినేషన్. ఇటీవల విడుదలైన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. రామ్ ఫుల్ మాస్ లుక్ లో చూపించాడు పూరీ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమా జులై 12న రిలీజ్ చేయనుండగా.. అప్పుడే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టేశారు చిత్రయూనిట్. రొటీన్ గా కాకుండా కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగమే ఈ ఇస్మార్ట్ దుస్తుల కాన్సెప్ట్. ఈసినిమాలో రామ్ కాస్త వెరైటీగా పూల పూల షర్ట్స్ వేసిన సంగతి గమనించే ఉంటారు. దీంతో ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన దుస్తుల్ని అమ్మకానికి ఉంచబోతున్నట్లు నిర్మాత ఛార్మి చెప్పారు.. ‘‘ఇస్పెషల్‌’ పేరుతో దుస్తుల్ని అమ్మకానికి ఉంచబోతున్నాం. www.beismart.in వెబ్‌సైట్‌లో మీ పేరును నమోదు చేసుకోండి. వీరిలోని కొందరు అదృష్టవంతులకు చిత్ర బృందం నుంచి ప్రత్యేకమైన సర్‌ప్రైజ్‌ అందుతుంది’ అని ఛార్మి అన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ అదృష్టవంతులు మీరే అవుతారేమో ట్రై చేయండి..

కాగా ఈసినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్‌, నభా నటేశ్‌ కథానాయికలు. పూరీ కనెక్ట్స్‌ పతాకంపై పూరీ, ఛార్మి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.‌

[subscribe]
[youtube_video videoid=M3bjgAiWpPA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =