నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ‘రూలర్’ (ప్రచారంలో ఉన్న పేరు) అనే సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను కోలీవుడ్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ తెరకెక్కించనున్నాడు. బాలయ్య 105వ చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను ఈ నెల 12న నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగనుందని టాక్. వాస్తవానికి ఈ చిత్రం గత నెల మే 17వ తేదీనే లాంచ్ కావాల్సి ఉంది. అయితే స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేయడం వలన ఈ జాప్యం జరిగిందని టాలీవుడ్ టాక్.
కాగా, బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో ఆర్ ఎక్స్100
ఫేమ్ పాయల్ రాజ్‌పుత్, ‘ఎఫ్ 2’ హీరోయిన్ మెహరీన్ నాయికలుగా నటించనున్నట్టు భోగట్టా. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెలువడనున్నాయి.
చిరంతన్ భట్ స్వరాలు సమకూర్చనున్న ఈ చిత్రం… 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
[youtube_video videoid=An5jOvff3RA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: