లేడీ సూపర్ స్టార్ విజయశాంతి… దాదాపు పాతికేళ్ళ పాటు పలు వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించి తన అసమాన అభినయంతో ప్రేక్షకులను అలరించిన నిన్నటి తరం కథానాయిక. పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాలకు దూరమైన ఈ సీనియర్ నటీమణి… సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’తో రీ-ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ సినిమాలో విజయశాంతి పాత్ర తీరు తెన్నులపై కొన్ని ఆసక్తికరమైన వార్తలు టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హిలేరియస్ ఎంటర్టైనర్లో… సమాజ శ్రేయస్సు కోసం పరితపించే ఓ పవర్ఫుల్ ఫ్యాక్షన్ లీడర్‌గా కనిపించనుందట ఈ లేడీ సూపర్ స్టార్. అంతేకాదు… తనను నమ్మిన ప్రజలను, తన ఊరిని ఓ నరరూప రాక్షసుడు (జగపతిబాబు) నుంచి కాపాడటం కోసం… తప్పనిసరి పరిస్థితుల్లో కత్తి కూడా పట్టాల్సి వస్తుందట. ఇలా… ఒక గృహిణిగా, తల్లిగా, నలుగురి మంచి కోరే ఒక మహిళగా… త్రీ షేడ్స్ ఉన్న ఓ డిఫరెంట్ క్యారెక్టర్లో రాములమ్మ దర్శనమివ్వబోతున్నట్టు సమాచారం. అయితే… ఈ కథనాల్లో నిజమెంతో తెలియాలంటే మరి కొంతకాలం వేచి ఉండాల్సిందే.
‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న సరిలేరు నీకెవ్వరు… 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























