ఈ ఏడాది ఆరంభంలో ‘ఎఫ్ 2’ వంటి బ్లాక్ బస్టర్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో… మెగాప్రిన్స్ వరుణ్ తేజ్‌తో కలసి వెంకీ చేసిన అల్లరి ఆడియన్స్‌ను అలరించింది. ప్రస్తుతం తన మేనల్లుడు యువ సామ్రాట్ నాగ చైతన్యతో కలసి ‘వెంకీమామ’లో నటిస్తున్నాడు ఈ సీనియర్ హీరో. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రీకరణ దశలో ఉంది. ఓ వైపు ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే… వెంకీ ఇప్పుడు మరో మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది?’ వంటి డీసెంట్ మూవీస్‌ని ప్రెజెంట్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకీ ఓ సినిమా చేయనున్నాడట. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.సురేష్ బాబు నిర్మించనున్నాడని తెలుస్తోంది. నేడో, రేపో ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్టు వినికిడి. ఏది ఏమైనా వరుస సినిమాలతో మళ్ళీ తన అభిమానులను అలరించనున్నాడన్నమాట వెంకీ.
కాగా… వెంకీ, చైతు కలసి నటిస్తున్న ‘వెంకీమామ’ దసరా కానుకగా విడుదల కానుందని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: