‘భరత్ అనే నేను’తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన ఉత్తరాది భామ కియారా అద్వాని. ఆ తరువాత వినయ విధేయ రామ
లోనూ కనువిందు చేసింది. ప్రస్తుతం కియారా పలు హిందీ చిత్రాలలో కథానాయికగా నటిస్తూ బిజీగా ఉంది. కాగా, సౌత్ ఇండియన్ ఫిలిమ్స్‌లో నటించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే కియారా… ఇప్పుడు కోలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుందని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్ హీరోగా, దర్శకుడు విఘ్నేశ్ శివన్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. శివ కార్తికేయన్ కెరీర్‌లో 17వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా కోసం కియారాని హీరోయిన్‌గా సెలెక్ట్ చేసినట్టు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ… ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. త్వరలోనే కియారా కోలీవుడ్ ఎంట్రీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే… షాహిద్ కపూర్, కియారా అద్వాని జంటగా నటించిన హిందీ ఫిలిమ్ ‘కబీర్ సింగ్’(‘అర్జున్ రెడ్డి’కి రీమేక్) ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
[youtube_video videoid=EPhHbH7FR74]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: