
ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 56


పోలీస్ ఆఫీసర్ గెటప్ లో సంగీత దర్శకుడు కోటి

తమిళ వెబ్ సిరీస్ ప్రారంభం

హీరోయిన్ రీతూ వర్మ కొత్త సినిమా

బాలీవుడ్ రీమేక్ లో విశ్వక్ సేన్..?

#SaveNallamala పై టాలీవుడ్ స్పందన
సీబీఐ ఆఫీసర్‌గా మీనా?
మెగా హీరో సరసన ‘ఇస్మార్ట్’ హీరోయిన్?
చైతూ, రష్మిక జంటగా `దిల్` రాజు చిత్రం?
రామ్‌తో ‘ఆర్ ఎక్స్ 100’ డైరెక్టర్?
పాయల్‌తో తేజ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్?

Nani's గ్యాంగ్ లీడర్ మూవీ పబ్లిక్ ఒపీనియన్

మంచు విష్ణు సినిమా ఆధారంగా 'భాగీ 3'

పూరీ-విజయ్ సినిమా స్టోరీ అది కాదట...!

ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ మూడో సినిమా ప్రకటన..!

లక్కీ హీరోయిన్

కామిక్ రివెంజ్ డ్రామా

కాలం మారింది కానీ నువ్వు మారలేదు..!
అనిల్ రావిపూడి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ ‘సరిలేరు నీకెవ్వరు' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దీనితో విజయశాంతితో మళ్లీ నటిస్తుండడం పట్ల మహేశ్ బాబు ట్విట్టర్ లో స్పందించిన సంగతి కూడా విదితమే. 1989లో 'కొడుకు దిద్దిన కాపురం' చిత్రంలో మొదటిసారి ఆమెతో పాటు నటించాను. ఇప్పుడు మళ్లీ 30 ఏళ్ల తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నాను. జీవితం ఫుల్ సర్కిల్ లాంటిది అని ఆమెతో తన చిన్నప్పటి ఫొటోను ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

పోలీస్ ఆఫీసర్ గెటప్ లో సంగీత దర్శకుడు కోటి
ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవిత చరిత్ర ఆధారంగా RTR ఫిల్మ్స్ బ్యానర్ పై నర్రా శివనాగేశ్వర రావు దర్శకత్వం లో దేవినేని మూవీ రూపొందుతుంది. నందమూరి తారక రత్న -దేవినేని నెహ్రూ, తుమ్మల ప్రసన్న కుమార్ -చలసాని వెంకటరత్నం, సురేష్ కొండేటి - వంగవీటి రంగా పాత్రలలో నటిస్తున్నారు. తన సంగీతం తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సంగీత దర్శకుడు కోటి ఈ మూవీ లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ KS వ్యాస్ గా నటించడం విశేషం.

తమిళ వెబ్ సిరీస్ ప్రారంభం
టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఇంగ్లీష్, తెలుగు భాషలలో రూపొందున్న కాల్ సెంటర్, ముంబై సాగ హిందీ, అ !2తెలుగు, ఇండియన్ 2, సూర్య 39 తమిళ మూవీస్ షూటింగ్ జరుపుకొంటున్నాయి. కాజల్ అగర్వాల్ ఒక తమిళ వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెడుతున్నారు . తమిళ మూవీస్ లో హీరోయిన్ గా వెలుగొందుతున్న తెలుగమ్మాయి ఆనంది ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

హీరోయిన్ రీతూ వర్మ కొత్త సినిమా
ప్రేమ ఇష్క్ కాదల్, ఎవడే సుబ్రహ్మణ్యం వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో నటించిన హైదరాబాద్ గర్ల్ రీతూవర్మ, విజయ్ దేవరకొండ జంటగా రూపొందిన పెళ్ళి చూపులు మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ లో పెర్ఫార్మెన్స్ కు రీతూ వర్మ బెస్ట్ యాక్ట్రెస్ గా నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. కోలీవుడ్ లో హీరోయిన్ గా కొనసాగుతున్న రీతూ వర్మ మూడు సంవత్సరాల తరువాత ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై శర్వానంద్, రీతూ వర్మ జంటగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషలలో రూపొందుతున్న మూవీ షూటింగ్ క్రిందటి వారం ప్రారంభమయింది.

బాలీవుడ్ రీమేక్ లో విశ్వక్ సేన్..?
మలయాళం సినిమా అంగమలై డైరీస్ ను తెలుగులో 'ఫలక్ నుమా దాస్' గా రీమేక్ చేసి మంచి సక్సెస్‌ను సొంతం చేసుకున్న హీరో విశ్వక్ సేన్. ఇక ఆ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న తర్వాత ‘పాగల్’ అనే మరో కొత్త సినిమాతో రాబోతుంది. నరేష్ రెడ్డి కుప్పిలి దర్శకుడి గా పరిచయం అవుతున్న ఈ సినిమా ను... బెక్కం వేణుగోపాల్ఈ నిర్మించనున్నారు. లవ్ స్టొరీగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ ద్వితీయార్థం నుండి మొదలుకానుంది.

#SaveNallamala పై టాలీవుడ్ స్పందన
నల్లమల ఫారెస్ట్ కర్నూల్, గుంటూరు, కడప , మెహబూబ్ నగర్, ప్రకాశం జిల్లాలలో విస్తరించింది. ఈ అటవీ ప్రాంతం పై ఆధారపడి పలు గిరిజన జాతులు జీవనం సాగిస్తున్నాయి. పశు పక్ష్యాదులు, జంతువులు ఆవాసం గా ఉంది. పులుల సంతతి కూడా ఎక్కువగా ఉంది. యురేనియం కై కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం లోని నాగర్ కర్నూల్ అమ్రాబాద్ ఫారెస్ట్ ఏరియాలో తవ్వకాలకు ప్రయత్నిస్తుండడం తో టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

మహేష్ బాబు చక్రసిద్ద్ నాడీ వైద్యం గురించి చెప్పడానికి కారణం..?
ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అలానే అప్పుడప్పుడు అవేర్ నెస్ కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. ఇప్పుడు తాజాగా మరో విషయంలో మహేష్ అవేర్ నెస్ చేయడం ఆశ్ఛర్యం కలిగిస్తుంది. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా..? 'చక్రసిద్ద్ నాడీ వైద్యం' గురించి. కాస్త ఆశ్ఛర్యంగా ఉన్నా.. ఈ వైద్యం వల్ల తనకు కలిగిన లాభం ఏంటో తెలియచేసాడు.
సీబీఐ ఆఫీసర్‌గా మీనా?
మీనా... నిన్నటి తరం అగ్ర కథానాయిక. 90ల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఈ టాలెంటెడ్ యాక్ట్రస్... దక్షిణాదికి చెందిన నాలుగు భాషల్లోనూ నటించి మెప్పించింది. ప్రస్తుతం మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న మలయాళ చిత్రం ‘షైలాక్’లో ముఖ్య పాత్ర పోషిస్తోంది మీనా.
మెగా హీరో సరసన ‘ఇస్మార్ట్’ హీరోయిన్?
‘ఇస్మార్ట్ శంకర్’ రూపంలో తొలి విజయాన్ని అందుకున్న నిధి అగర్వాల్... ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా సెలెక్ట్ అయినట్టు టాక్.
చైతూ, రష్మిక జంటగా `దిల్` రాజు చిత్రం?
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం `జోష్`(2009). ప్రముఖ నిర్మాత `దిల్` రాజు ఈ సినిమాని నిర్మించారు. `జోష్` కమర్షియల్‌గా మెప్పించకపోయినా... నటుడిగా చైతూకి మంచి గుర్తింపుని తీసుకువచ్చింది. కాగా... `జోష్` తరువాత చైతూ, రాజు కాంబినేషన్‌లో పదేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం మరో సినిమా రాబోతోంది. `జోష్` చిత్రంతో వాసు వర్మ దర్శకుడిగా పరిచయం కాగా... అప్ కమింగ్ ప్రాజెక్ట్ తో శశి నిర్దేశకుడిగా తొలి అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది చివరలో పట్టాలెక్కనుందని సమాచారం.
రామ్‌తో ‘ఆర్ ఎక్స్ 100’ డైరెక్టర్?
గత ఏడాది జూలై నెలలో విడుదలైన `ఆర్ ఎక్స్ 100`తో సంచలన విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. ఇక ఈ సంవత్సరం జూలై నెలలో రిలీజైన `ఇస్మార్ట్ శంకర్`తో యువ కథానాయకుడు రామ్ కూడా అదే స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. కట్ చేస్తే... త్వరలో ఈ ఇద్దరి కలయికలో ఓ ఆసక్తికరమైన చిత్రం రాబోతుందని తెలిసింది.
పాయల్‌తో తేజ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్?
‘ఆర్ ఎక్స్ 100’ వంటి బ్లాక్ బస్టర్ మూవీతో కథానాయికగా పరిచయమైంది పంజాబీ జాబిలి పాయల్ రాజ్‌పుత్. తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ... ప్రస్తుతం ఫీమేల్ సెంట్రిక్ మూవీ ‘ఆర్‌డిఎక్స్ లవ్’తో పాటు ‘వెంకీమామ’, ‘డిస్కోరాజా’ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇవి సెట్స్‌పై ఉండగానే... మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం దక్కించుకుందని టాక్.

Nani's గ్యాంగ్ లీడర్ మూవీ పబ్లిక్ ఒపీనియన్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.

చిన్ననాటి జ్ఞాపకాలు - 30 ఏళ్ల తర్వాత 'సరిలేరు నీకెవ్వరు'లో
అనిల్ రావిపూడి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ ‘సరిలేరు నీకెవ్వరు' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా... దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు.

మంచు విష్ణు సినిమా ఆధారంగా 'భాగీ 3'
భాగీ, భాగీ 2 సిరీస్ తో మంచి హిట్స్ కొట్టాడు యంగ్ హీరో టైగర్ ష్రాఫ్. యాక్షన్ సన్నివేశాలే ‘భాగీ’ సిరీస్‌ను బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలుపుతున్నాయి అనొచ్చు. టైగర్ ష్రాఫ్, దిశాపటానీ జంటగా తెరకెక్కిన భాగీ 2ను ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో సాజిద్ నడియాద్‌వాలా నిర్మించారు. 2016లో తెలుగు సినిమా క్షణం రీమేక్‌గా బాలీవుడ్‌లో భాగీ తెరకెక్కించి ఘనవిజయం దక్కించుకున్నారు.

పూరీ-విజయ్ సినిమా స్టోరీ అది కాదట...!
ఇటీవలే డియర్ కామ్రేడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ ఇప్పుడు వరుస సినిమాలతో వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఫేమ్ క్రాంతి మాధవ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి లీట్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో విజయ్ సింగరేణి ఉద్యోగిగా కనిపించనున్నాడని సమాచారం.

ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ మూడో సినిమా ప్రకటన..!
ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సేషన్ హిట్ కొట్టాడు డైరెక్టర్ అజయ్ భూపతి. ఇక ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. అయితే ఆ తర్వాత రవితేజ తో మహాసముద్రం సినిమా తెరెకెక్కించనున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. రీసెంట్ గా ఈ సినిమా కూడా ఆగిపోయినట్టు తెలుస్తుంది. పూర్తి స్క్రిప్ట్‌ను అందించకపోవడంతోనే రవితేజా అజయ్ స్క్రిప్ట్‌ను రిజక్ట్ చేసాడట. ఆ తర్వాత నాగచైతన్య పేరు తెరపైకి వచ్చింది. ఇక రెండో సినిమాపై క్లారిటీ రాకముందే.. మూడో సినిమాపై క్లారిటీ ఇచ్చారు.

లక్కీ హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన సాహో, చిచ్చోరే వారం రోజుల గ్యాప్ లో రిలీజయి ఘనవిజయం సాధించాయి. సాహో మూవీ 100కోట్ల క్లబ్ లో చేరింది. చిచ్చోరే మూవీ 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసి 100 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఈ రెండు మూవీస్ దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్నాయి. తాను నటించిన రెండు మూవీస్ ఘనవిజయం సాధించడం తో శ్రద్ధా కపూర్ ఆనందానికి హద్దులు లేవు.
కంగనా 'జయలలిత' కోసం కెప్టెన్ మార్వెల్ మేకప్ ఎక్స్పర్ట్..!
ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి' రూపొందుతున్న సంగతి తెలిసిందే. జయలలిత జీవిత ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో ఆమె సినీ జీవితంతో పాటు.. రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు.. రాజకీయంలో ఎదుర్కొన్న వివాదాలు అన్నీ ఈ బయోపిక్ లో చూపించనున్నారు. ఇక ఇటీవలే . ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నుండి ప్రారంభమవుతుందని అలాగే సినిమా 2020 మేలో తెరపైకి రానుందని చెప్పారు.

కామిక్ రివెంజ్ డ్రామా
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన కామిక్ రివెంజ్ డ్రామా NANI'S గ్యాంగ్ లీడర్ మూవీ రేపు (13వ తేదీ) రిలీజ్ కానుంది. హీరో కార్తికేయ విలన్ గా నటించడం ఆసక్తికర విషయం. సీనియర్ నటి లక్ష్మి, శరణ్య, ప్రియాంక అరుళ్ మోహన్, శ్రీయా రెడ్డి, ప్రాణ్య లేడీస్ గ్యాంగ్ గా నటించగా నాని గ్యాంగ్ లీడర్ గా నటించారు. హీరో నాని సపోర్ట్ తో ఒకరితో ఒకరికి రిలేషన్ లేని ఈ గ్యాంగ్ ప్రతినాయకుడు (కార్తికేయ )పై ప్రతీకారం తీర్చుకొనే కథ తో ఈ మూవీ రూపొందింది.